బ్రేకింగ్ న్యూస్ : రేవంత్ రెడ్డి అరెస్టు
తెలంగాణా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్,
కెసియార్ కుటుంబానికి మెయిన్ టార్గెట్ గా మారిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు
చేశారు. కెసియార్ సభను అడ్డుకొమ్మని, టిఆర్ఎస్ ను బొందపెడతానని రేవంత్ చేసిన పరుష
పదజాలం నేపధ్యంలో ఈరోజు తెల్లవారిజామున ఇంట్లో ఉన్న సమయంలోనే పోలీసులు అరెస్టు
చేయటంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారమే పోలీసులు రేవంత్
ను అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత జడ్చర్లలోని ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.
ఈరోజు కెసియార్ కొడంగల్ లో బహిరంగసభ నిర్వహించనున్నారు. కెసియార్ సభను అడ్డుకోమంటూ రేవంత్ పిలుపిచ్చారు. దాంతో రెండు రోజులుగా కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తలు తలెత్తాయి. కొడంగల్ లో పోటీ చేస్తున్న రేవంత్ ను ఎలాగైనా ఓడించాలని కెసియార్ గట్టి పట్టుదలతో ఉన్నారు. రేవంత్ ఓటమే లక్ష్యంగా కెసియార్ కొడుకు కెటియార్, మేనల్లుడు హరీష్ రావు తో పాటు మరికొందరు నేతలను కూడా ప్రధానంగా కొడంగల్ లోనే కేంద్రీకరించారు. దాంతో ప్రతీ రోజు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణమే కనబడుతోంది.