ఓటుకు నోటు కేసు ఇప్పుడు ముదిరి పాకాన పడింది - వైడర్-టర్న్ తీసుకుంది

“నేఱగాళ్ళ పాపం పండినప్పుడే, న్యాయం ధర్మ సాగర తీరం చేరుతుంది”  ఇప్పుడు కొందరి పాపాల చిట్ఠా సరిగ్గా బాలన్స్ అవుతుంది. ఓటుకు నోటు కేసు ముదిరి పాకాన పడినట్లుంది. “ఓటుకు నోటు కేసు” అనబడే మహా కుంభకోణంలో సంచలన మలుపు. నిందితుడు జెరూసలేం మత్తయ్య అప్రూవర్‌ గా మారేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ కు మత్తయ్య లేఖ రాశారు. 

“ఓటుకు నోటు” కేసు లో అనైతిక చర్యలకు పాల్పడిన వారు తనను చంపేందుకు కుట్ర చేస్తు న్నారని ఆ లేఖ లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేసి కేసులో కీలక విషయాలు బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు తనకు ‘థ్రెటెనింగ్ కాల్స్’ కూడా వస్తున్నాయని మత్తయ్య వివరించారు. కాబట్టి సుప్రీం కోర్టు ముందు తనకు తెలిసిన రహస్యాలన్నీ చెబుతానని అందుకు అవకాశం ఇవ్వాలని మత్తయ్య కోరారు. కేసులో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని, కాబట్టి  “ఓటుకు నోటు కేసు”  తో పాటు “ఫోన్ ట్యాపింగ్ కేసు” ను కూడా సీబీఐకి అప్పగించాలని మత్తయ్య కోరారు. సుప్రీం కోర్టు ముందు తాను చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రాణహాని ఉన్నందున ముందే అన్ని విషయాలు కోర్టుకు చెప్పేస్తానని వాటిని రికార్డ్ చేయాలని కోరారు.

“ఓటుకు నోటు కేసు” కనుమరుగై పోయినట్టేనని భావిస్తున్నవేళ, హఠాత్తుగా ఏ-4 అప్రూవర్‌గా మారేందుకు సిద్ధవడంతో టీడీపీలో కలకలం రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ని, బీజేపీని ఇటీవల టీడీపీ, చంద్రబాబు మరియు ఆయన అనుకూల సామాజిక వర్గ మీడియా, వేనోళ్ళతో దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో, రాజకీయంగానే ఈ పరిణామం చోటు చేసుకుందా?  అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అందరూ అనేది కూడా చంద్రబాబు నాయుడిది అంతా రాజకీయం కాదా! అని. ఒకవేళ రాజకీయమైనా నేఱం నేఱమే కదా! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: