పవన్ కళ్యాణ్ మరో జలీల్ ఖాన్ అవుతున్నాడా ... రిజర్వడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడంటా...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఆవేశం లో నుంచి మాటలకు అసలు లాజిక్స్ లేకుండా పోతున్నాయి. ఆవేశం తో మాట్లాడినప్పడు ఏం మాట్లాడతామో కొన్ని సార్లు మనకే అర్ధం కాదు. అదే పరిస్థితి ఇప్పడూ పవన్ కు వచ్చిందని చెప్పాలి. కొన్ని విషయాల్లో జలీల్ ఖాన్ ను మించి పోతున్నాడని చెప్పాలి. ముందుగా అనంతపురం.. అక్కడ నుంచి పవన్ పోటీ చేస్తాడని ప్రకటించి చాలాకాలం అయ్యింది. అయితే ఆ తర్వాత దాని గురించి అప్ డేట్ లేదనుకోండి.


ఆ తర్వాత పవన్ కల్యాణ్ పోటీ.. అనే విషయంలో చాలా నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. పవన్ కల్యాణే తనకు ఆయాచోట్ల నుంచి పోటీ చేయాలని ఉందని ప్రకటించుకున్నాడు. ఇక మరికొన్ని స్థానాల విషయంలో జనసేన వర్గాలు ఆ మేరకు ప్రచారం చేశాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేస్తాడని.. వాళ్లు ప్రచారం చేసిపెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పిఠాపురం నియోజకవర్గం విషయంలో. ఇక్కడ నుంచి పవన్ పోటీ చేస్తాడట.


ఇదీ కథ. అనంతపురం నుంచి పాడేరు వరకూ.. పవన్ కల్యాణ్ పోటీ గురించి అనేక నియోజకవర్గాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పాడేరు రిజర్వడ్ నియోజకవర్గం అయినా.. అక్కడ నుంచి పోటీకి పవన్ కల్యాణ్ మక్కువ చూపుతున్నాడట! ఈసీని ఒప్పిస్తారేమో చూడాలి! ఇది పవన్ కల్యాణ్ లో ఉన్న గందరోగళానికి నిదర్శనమో లేక జనసేనలో ఉన్న గందరగోళానికి రుజువు అనుకోవాలో కానీ.. పవన్ కల్యాణ్ పోటీచేయగా పోనూ మిగిలిన నియోజకవర్గాలు ఏవైనా ఉంటే.. వాటికి అభ్యర్థులు ఖరారు చేయడమే మిగిలిందిక!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: