పవన్ కు అత్యాశ బాగానే ఉంది... కలలు కంటున్నాడు...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో నేనే సీఎం అని చెబుతున్నాడు అయితే ఎలా సీఎం అవుతాడంటే కర్ణాటక నేత కుమార స్వామి తరహాలో అవుతానని చెబుతున్నాడు. కర్ణాటకలో ఇటీవల జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోయిన దగ్గర నుంచినే పవన్ రాజకీయంగా యాక్టివేట్ కావడం, జనాల మధ్యకు రావడం ఎక్కువవ్వడం, ఇప్పుడు.. స్వయంగా అదే ఉదాహరణను ప్రస్తావించడం ఆసక్తిదాయకంగా ఉంది.


ఇలా పవన్ కల్యాణ్ ఆశలన్నీ జాక్ పాట్ ‌గా సీటు దక్కడం మీదే ఉన్నాయని స్పష్టం అవుతోంది. అయితే.. పవన్ కల్యాణ్‌‌ది అత్యాశ అని కూడా ఇట్టే స్పష్టం అవుతోంది. ఎందుకంటే.. ముందుగా మెజారిటీ కోసం ప్రయత్నించాలి, మెజారిటీ దక్కని పక్షంలో అలాంటి జాక్ పాట్ దక్కుతుందేమో అని ఆశించాలి. అయితే మొదటే జాక్ పాట్ మీద ఆశలు పెట్టుకుంటే? కథ ఎక్కడ ముగుస్తుందో చెప్పనక్కర్లేదు. జేడీఎస్ అదే చేసింది. ముందుగా ముఖ్యమంత్రి పీఠం తమదే అనేంత స్థాయిలో పని చేసింది. చివర్లో జాక్ పాట్ గా అధికారాన్ని దక్కించుకుంది.


అయినా.. జేడీఎస్‌కు జాక్ పాట్‌గా సీటు దక్కిన విషయం వాస్తవమే కానీ, ఆ పార్టీకి ఉన్న బలాన్ని పవన్ తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. కుమారస్వామిలా తనూ.. అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నాడు. అయితే జేడీఎస్ పార్టీకి, జనసేన పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏనుగుకు, ఎలుకకూ ఉన్నంత! జేడీఎస్‌ది కుల రాజకీయమే.. వక్కలిగల మద్దతుతోనే ఆ పార్టీ తన ఉనికిని కాపాడుకొంటూ వచ్చింది. కానీ జేడీఎస్‌ది కర్ణాటక రాజకీయంలో దశాబ్దాల ప్రస్థానం. జేడీఎస్ రాజకీయ చరిత్రను చూస్తే.. ఆ పార్టీ మూలస్తంభం దేవేగౌడ కొన్ని నెలలే అయినా ప్రధానమంత్రి అయ్యాడు, కుమారస్వామి గతంలో ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. అప్పట్లో కుమార కొంత వరకూ ఆకట్టుకున్నాడు. ఇక జేడీఎస్‌‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉంది. కార్యకర్తలున్నారు. ఓడిపోతామని తెలిసినా రాష్ట్రమంతా పోటీ చేసే నేతలున్నారు. ఆ పార్టీని నడపడానికి దేవేగౌడ కుటుంబం ఎన్నో డక్కామొక్కీలు తింటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: