హరీష్ రావు పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఎందుకు అలా...!

Prathap Kaluva

హరీష్ రావు పరిస్థితి ఇప్పడూ అగమ్యగోచరంగా తయారైంది. కెసిఆర్ హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది చాలా మంది ఆరోపిస్తున్నారు. హరీష్‌ కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ మీడియాలో అసలు కవర్‌ చేయడంలేదని, వేసినా ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఉందంటూ తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో వ్యాఖ్యానించిన హరీష్‌ ఆ తరువాత తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదని, ప్రజల అభిమానం చూసి భావోద్వేగంతో అన్నానని వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్‌ కరగలేదు.


హరీష్‌ను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నిలబెడతారని, సిద్ధిపేట నుంచి కేసీఆరే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా కేసీఆర్‌ మౌనంగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఏం చేయబోతారనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. అందుకే రకరకాల ఊహాగానాలు ప్రబలుతున్నాయి. కుమారుడు కేటీఆర్‌కు అడ్డురాకుండా ఉండేందుకే హరీష్‌ను లోక్‌సభకు పంపాలని కేసీఆర్‌ యోచిస్తున్నారని కొందరు నేతలు చెబుతున్నారు.


ఈనెల సెప్టెంబరు మొదటివారంలో హుస్నాబాద్‌లో బహిరంగ సభ జరిగినప్పుడు దాని ఏర్పాట్లు హరీష్‌రావే చూశారు. అప్పటి ఆయన ప్రసంగం టీఆర్‌ఎస్‌ మీడియా కవర్‌ చేసింది. ఇక అంతే... ఆ తరువాత ఆయన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా ఆయనకు ఇవ్వడంలేదని తెలుస్తోంది. మేనల్లుడిపై కేసీఆర్‌ మరీ కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోంది. లోక్‌సభకు పోటీ చేయాలని ఆదేశిస్తే హరీష్‌ కాదనకపోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: