నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !

frame నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !

Image result for burning rafale deal modi in trouble

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ ను సర్వీస్ ప్రొవైడర్ గా ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ఆయుధ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌ కు సూచించినట్టు శుక్రవారం ఫ్రెంచి పత్రిక మీడియా పార్ట్‌ వెల్లడించింది. స్వయంగా ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఈ విషయాన్ని తమ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ సంస్థ ఎంపిక లో తమ పాత్రేమీ లేదని, డసాల్ట్‌ కంపెనీయే ఆ సంస్థను ఎంచుకుందని కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ బూటకాలని తేలిపోయింది. అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ ను రాఫెల్‌ భాగస్వామిగా మోదీ ప్రభుత్వమే ఎంపిక చేసిందని, "సర్వీస్‌ ప్రొవైడర్‌" గా దాని తోనే ఒప్పందం కుదుర్చుకోవాలని ఫ్రాన్స్‌కు తేల్చి చెప్పిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ సంచలన విషయాన్ని బయటపెట్టారు 


డసాల్ట్‌ ఏవియేషనే తన భాగస్వామి గా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని, దీంట్లో తమ ప్రమేయం ఏమీ లేదని భారత ప్రభుత్వం ప్రకటన చేసిన దరిమిలా,  ఈ సమాచారం ప్రాధాన్యత సంతరించుకొంది. భారత ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ రంగసంస్థ అయిన ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ - హెచ్ ఏ ఎల్ ’ ను తప్పించి, అనుభవం లేని "రిలయన్స్‌ డిఫెన్స్‌" కు కాంట్రాక్టును అప్పగించిందని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఇదో వజ్రాయుధంగా దొరికింది. ఈ విమానాల కు భారత్‌లో సేవలు అందించే బాధ్యతను నాడు భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్నాల్లో ఒకటైన "హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ - హెచ్‌ఏఎల్‌" కు అప్పగించారు. ఇప్పుడు హెచ్‌ఏఎల్‌ ను తప్పించి, మోడీ మితృడు అని  రాహుల్ గాంధి చే పదేపదే చెప్పబడుతున్న అనిల్‌ అంబానీ కి చెందిన 'రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌' ను ఎంపిక చేశారు. 

దీనికి ఋజువుగా రాహుల్ చెప్పే ఆధారమేమంటే  "2015 ఏప్రిల్‌ లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ వెళ్లారు. ఆ సదర్భంలో పదో తేదీన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ తో సమావేశం  అయ్యారు. సత్వర వినియోగానికై 36 రాఫెల్‌ యుద్ధ విమానా లను సరపరా చేయాలని కోరారు. "పొరుగు దేశాలు తమ సైనిక బలాన్ని పెంచుకుంటున్నాయి. మనకు అత్యవసరంగా యుద్ధ విమానాలు సమకూర్చుకోవాల్సిన అవసరముంది. అందుకే 36 రాఫెల్‌ విమానాలు కొంటున్నాం" అని ప్రకటించారు. అప్పటికి సరిగ్గా 12 రోజుల ముందే రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ అతి స్వల్ప మూలధనంతో రూపు దిద్దుకుందని సమాచారం.  తర్వాత ఏడాది 2016 లోనే హోలాండ్‌ భార్య తీసిన సినిమాకు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పెట్టుబడి పెట్టింది. తరచి చూస్తే రాహుల్ గాంధి వాదనకు ఆధారాలు కనిపిస్తున్నా నిజానిజాలు తేలవలసి ఉంది.  ఆధారాలు కనిపిస్తున్నా ఇందులో ఏదో ఫిష్షీ కనిపిస్తుంది. రెండేళ్ళు నిర్మాణంలో ఉండి మూలనపడ్ద సినిమాకు మోక్షం కలిగించే అవసరం రిలయన్స్ కు ఏముంది? ఇది పరిశీలించలసిన అంశం కాదా! ప్రపంచంలోని రాజకీయ నాయకులు అంతా ఒక్కటే. అవసరాలు వాటి ప్రాధమ్యాలు వారి రాజకీయాలను నిర్దేశిస్తాయి. 

Reliance Entertainment has nothing to hide on Rafael deal-French film link: Sources

"ఈ వ్యవహారంలో మా ప్రమేయం లేదు. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు పేరు ప్రతిపాదించింది. ఆ మేరకు అనిల్‌ అంబానీ గ్రూపుతో డసాల్ట్ ఏవియేషన్ సంప్రదింపులు జరిపింది. భారత ప్రభుత్వమే ఎంపిక చేసి ఇచ్చిన భాగస్వామిని తీసుకున్నాం. మాకు మరోఅవకాశం లేదు" అని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పినట్టు మీడియా పార్ట్‌ పత్రిక వెల్లడించింది. రిలయన్స్‌ నే ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించగా "ఈ వ్యవహారంలో మా అభిప్రాయానికి అవకాశమే లేదు" అని తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న హోలాండే తనకై తాను ఈ విషయం చెప్పడంతో బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. 


రాఫెల్‌ యుద్ధ విమానాలకు సేవలు అందించే సామర్థ్యం "హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ - హెచ్ ఏ ఎల్" కు లేదన్న నరేంద్ర మోదీ సర్కారు మాటలు వట్టి బూటకమే నని హెచ్ ఏ ఎల్ మాజీ అధికారి అధినేత సువర్ణ రాజు ఇటీవలే వ్యాఖ్యానిస్తూ కుండ బ్రధలు కొట్తారు. ఆ తరవాత రోజే ఈ పరిణామం జరగడంతో బీజేపీ నెత్తిన మరో పిడుగు పడ్డట్టైంది. భారత్‌ లో రాజకీయా లను రసకందాయంలో పడేసి సెగలు రేపుతున్న రాఫెల్‌ డీల్‌ పై ఫ్రెంచ్‌ జర్నల్‌ మీడియా పార్ట్‌ కు అంత ప్రత్యేక ఆసక్తి ఎందుకు? ఫ్రంకోఇస్ హోలాండ్‌ను ఆ ప్రశ్న అడగటానికి కారణం ఏమిటి? ఐ వెరిఫై చేసుకొంటే మరో ప్రధాన అంశం బయట పడింది. అదేమిటంటే, ఫ్రాంకోఇస్ హోలాండ్‌ (జీవిత) భాగస్వామి - నటి ఫ్రెంచ్ సినిమా నిర్మాత జూలియా గయెట్‌, రెండేళ్ల క్రితం వచ్చిన ఫ్రెంచ్‌ సినిమా "టౌట్‌ ఎన్‌ హాట్‌" కు ఆమె సహ నిర్మాత. అయితే ఈమె జీవితం కొంత వివాదాస్పదం కూడా!  మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహిస్తూ దుర్మరణం పాలైన యువ సాహసి "కెవ్‌ ఆడమ్స్‌" స్ఫూర్తిగా నిర్మించిన సినిమా ఇది. టౌట్‌ ఎన్‌ హాట్‌ - సినిమా బడ్జెట్‌ కోటి యూరోలు ఇండియన్ కరెన్సీలో రమారమీ  90 కోట్ల రూపాయలు) ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సమస్యల వలంలో చిక్కుకుంది. అదే సమయంలో - ఆమెను ఆదుకోవటానికి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం 30 లక్షల యూరోలు ఆర్ధిక సహాయం (పైనాన్స్‌) చేస్తామని ముందుకొచ్చి చివరికి, 16 లక్షల యూరోల వరకు ఋణం ఇచ్చింది.

డబ్బుల్లేక ఎంతకీ కదలని ఈ సినిమాకు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఋణమే ప్రాణాధారం అయింది. ఈ నేపథ్యం లోనే... ‘మీడియాపార్ట్‌’ ప్రతినిధి హోలాండ్‌ కు ఈ ప్రశ్న సంధించటం జరిగిందట. రాఫెల్‌ డీల్‌కు, రిలయన్స్‌ డిఫెన్స్‌ కూ, మీ సతీమణి సహ నిర్మాతగా తీసిన చిత్రానికీ మధ్య సంబంధం ఉందా? అని కూడా ప్రశ్నించారట.  ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ ను ఎవరు, ఎలా ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. దీనికి హోలాండ్‌ సవివరమైన సమాధానం ఇచ్చారు. రిలయన్స్‌ సంస్థ తమకు ప్రత్యేకంగా ఎలాంటి మేలు చేయలేదన్నారు. తన సతీమణి జూలీ గయెట్‌ తీసిన చిత్రానికీ, దీనికీ సంబంధమే లేదని హోలాండ్‌ తేల్చిచెప్పారు.

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ హోలాండ్‌ హోలండ్ భాగస్వామి, ఫ్రెంచి సినిమాల నిర్మాత అయిన జూలీ గయెట్‌ తో కలిసి ఓ సినిమా నిర్మిస్తోందని, రాఫెల్‌ ఒప్పందానికి ముందే ఆ సినిమాకు సంబంధించిన ఒప్పందం కుదిరిందన్న వార్తలు వచ్చాయి. రాఫెల్‌ కొనుగోళ్లకు, ఈ సినిమాకు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హోలన్‌ వివరణ ఇస్తూ అలాంటిదేమీ లేదని ఖండించారు. హోలండ్  అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ 36రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్టు 2015 ఏప్రిల్‌ 10న పారిస్‌లో ప్రకటించారు.


దీనిపై రక్షణశాఖ అధికారప్రతినిధి స్పందిస్తూ ఆ వార్తలోని నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ వాణిజ్యపర నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికిగానీ, ఫ్రాన్స్‌ ప్రభుత్వానికిగానీ ఎలాంటి ప్రమేయం లేదని పునరుద్ఘాటించారు. దీనిపై భాజపా స్పందించలేదు. 


ఈ విషయమై వివిధ రాజకీయ పక్షాల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:


ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ వివరణ తర్వాత శరవేగంగా శరపరంపరగా ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించాయి.


అధికార బిజెపి పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మాత్రం "ఒకవేళ ఆ వార్త నిజమైతే అది తీవ్రమైన అంశం" అంటూ ట్వీట్‌ చేశారు.


కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేస్తూ "ప్రధాని స్వయంగా రహస్య పద్ధతుల్లో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు. ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ పుణ్యమా! అని మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. అంబానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టును ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం. ప్రధాని దేశాన్ని మోసగించారు. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు" అని వ్యాఖ్యానించారు. 



కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ ట్వీట్‌ చేస్తూ రాఫెల్‌ ధరలు ఎలా పెరిగాయో? కూడా ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ వివరించి ఉంటే బాగుండేదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరం ట్వీట్‌ చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి అబద్ధం చెబుతుందన్నారు.


డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ ఏదో చెడు జరగకపోతే ప్రభుత్వం ప్రతి రోజూ ఎందుకు అబద్ధం చెబు తుందని ప్రశ్నించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేస్తూ ఇప్పటికైనా నిజాలు బయటకు రావాలని డిమాండు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: