నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్

frame నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్

siri Madhukar
నల్గొండ జిల్లాలో జరిగిన పరువుహత్యను మరిచిపోకముందే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో పట్టపగలే పరువుహత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర కుమార్తె మాధవి, అల్లుడు సందీప్ పై మామ మనోహరాచారి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సందీప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మాధవి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.  తండ్రి చేసిన కత్తి దాడిలో కూతురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా, అల్లుడికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

తమపై దాడి ఘటనపై మాధవి భర్త, బాధితుడు సందీప్ మీడియాతో మాట్లాడారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే మాధవి తండ్రి మనోహరాచారి తమపై కక్షగట్టాడని సందీప్‌ ఆరోపించాడు. అసలు ఈ దారుణాలన్నింటికి కారణం తన అత్తేనని తెలిపాడు.ఆమె పదేపదే కులం ముఖ్యమని మాధవికి చెప్పేదన్నాడు. ‘ఆస్తి లేకపోయినా మన కులం వాడినే పెళ్లి చేసుకోవాలి. బయటవాళ్లు వద్దేవద్దు’ అని మాధవికి బ్రెయిన్ వాష్ చేసేదన్నారు. అంతే కాదు మాధవిని మేనల్లుడికి ఇచ్చి చేయాలనే ఆలోచనలో ఆమె ఉండేదని అన్నాడు.  కానీ  మాధవి తనను పెళ్లి చేసుకోవడంతో ఆమె మనోహరాచారిని రెచ్చగొట్టి ఈ హత్యాయత్నం చేయించిందని ఆరోపించాడు. 

గతంలో తమ ప్రేమ విషయం తెలుసుకున్న మాధవి తల్లిదండ్రులు తనను బెదిరించారని తెలిపాడు. 2015లో నా గురించి తెలుసుకున్న మాధవి తల్లి.. నీ అంతు చూస్తానంటూ బెదిరించినట్లు దాడి జరిగిన సందర్భంగా వెల్లడించాడు సందీప్. కులం పేరుతో పలుమార్లు మాధవీ తల్లిదండ్రులు తనను దూషించారని పేర్కొన్నాడు. 

తమను నమ్మించి..ప్లాన్ చేసి ప్లాన్ చేసి మరీ తమ అతి దారుణంగా మాధవి తండ్రి మనోహరాచారి దాడి కత్తితో దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తంచేశాడు. కూతుర్ని చూడాలని ఉంది రమ్మంటూ మనోహరా ఫోన్ చేశాడని, ఆయనతో మాట్లాడిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అనూహ్యంగా తమపై హత్యాయత్నం చేశాడని ఆరోపించాడు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాధవి ప్రస్తుతం సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: