ఆకాశం భూమి ఏకం చేసినా...బూమరాంగ్ అయిందిగా !!

frame ఆకాశం భూమి ఏకం చేసినా...బూమరాంగ్ అయిందిగా !!

Satya
అది చాలా  చిన్న కేసు. న్యాయ పరి భాషలో పెట్టీ కేసు అంటారు. అయితే అక్కడ ఉన్నది ఎవరో కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అందుకే ఆ కేసుకు అంతటి ప్రాముఖ్యతను పచ్చ మీడియా తెచ్చేసింది. టీడీపీ దళం ఓ రేంజిలో రెచ్చిపోయింది. వారం రోజులుగా ఎక్కడ చూసినా బాబును అరెస్ట్ చేస్తారట అంటూ టాక్. మొత్తానికి బాబ్లీ కేసులో బాబు రాజకీయంగా సక్సెస్ అయ్యారా..నో సీన్ రివర్స్ అయింది మరి.


లాయర్ ని పంపుతున్నారు :


బాబ్లీ కేసులో ఈ నెల 21న ధర్మాబాద్ కోర్టు ముందు విచారణకు చంద్రబాబు నాయుడు తరఫున ఒక న్యాయవాదిని పంపుతున్నారు.  ఈ రోజు టీడీపీ నాయకుల భేటీలో ఈ  విషయాన్ని  చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.   పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, ఇతర అధికారులతో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  అంటే  ఈ కేసు పచ్చ మీడియా ప్రచారం చేసినట్లుగా కొంపలు మునిగిపోయేది కాదనేగా అర్ధం.


రీకాల్ పిటిషన్ వేస్తారట :


ఇక ఈ కేసు విషయమై రీ కాల్ పిటిషన్ కూడా వేసేందుకు బాబు అండ్ కో డిసైడ్ అయింది. ఇప్పటికైతే న్యాయవాదిని పంపితే చాలు అని టీడీపీ భావిస్తోంది. ఇదిలా ఉండాగా ఈ కేసు అంత తీవ్రమైనది కాదని విపక్షాలు సహా  చాలా  మంది ఎన్నో రోజులుగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ మైలేజ్ కోసం తమ్ముళ్ళు గగ్గోలు పెట్టడమే కాదు. ఏదో జరిగిపోతోందన్న సీన్ క్రియేట్ చేశారు. మొత్తానికి రాజకీయం కాస్తా బూమరాంగ్ కావడంతో ఛివరకు కోర్టు  వైపు బాబు చూస్తున్నట్లు భోగట్టా.


బీజేపీ అటాక్  :


మరో వైపు నానా యాగీ చేసి ప్రధాని మోడీని సైతం ఈ కేసులో ఇరికించినందుకు బీజేపీ మండిపడుతోంది. బాబుపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది కూడా. ధర్మాబాద్ వారెంట్ పై అందరిపై నిందలు వేస్తూ న్యాయ వ్యవస్థను సైతం లాగేందుకు యత్నించినందుకు గాను ముంబై కోర్టు లో కోర్టు ధిక్కార పిటిషన్ ఒకటి బాబుపై వేయాలని బీజేపీ డిసైడ్ అయినట్లుగా సమాచారం. మొత్తానికి టీడీపీ రాజకీయం ఇలా రివర్స్ కావడం తో కమలనాధులు చాన్స్ తీసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: