రాధాకు ఉన్న ఏకైక ఆప్ష‌న్ అదేనా.. !

frame రాధాకు ఉన్న ఏకైక ఆప్ష‌న్ అదేనా.. !

VUYYURU SUBHASH
విజయవాడ సెంట్రల్‌ టికెట్‌ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. టికెట్‌పై వంగవీటి రాధా వెనక్కి తగ్గలే దు. అయితే సెంట్రల్‌ బాధ్యతలు మల్లాది విష్ణుకే అని వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగానే తెలుస్తోంది. ఇంత వరకూ రాధాతో జిల్లా కీలక నేతలు ఎవ్వరూ టచ్‌లోకి రాలేదు. వైసీపీ నేతల తీరుతో రాధా తీవ్ర మనస్తాపం చెందా రు. తాజా రంగా, రాధా మిత్రమండలితో కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ తొందరపడొద్దని.. చర్చిం చి నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలు, అభిమానులకు ఈ సందర్భంగా రాధా పిలుపునిచ్చారు. పైకి ఇలా అంటున్నా.. రాధా ఇప్ప‌టికే మాట్లాడాల్సిన వాళ్ల‌తో మాట్లాడాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


ఎట్టి ప‌రిస్తితిలోనూ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కావాల‌ని ప‌ట్టుప‌డుతున్న ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ఇప్ప‌టికే రా యభారం పంపార‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు సెంట్ర‌ల్ టికెట్ ఇవ్వాల‌ని, గెలుపు బాధ్య‌త కూడా త‌న‌దేన‌ని రాధా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ప‌వ‌న్ నుంచి ఇంకా ఎలాంటి స‌మాచారం రాలేద‌ని తెలిసింది. ఏదేమైనా.. మ‌రోప‌క్క‌, టీడీపీ నాయ‌కులు ఈ ప‌రిస్థితిని మౌనంగా ఉండి గ‌మ‌నిస్తున్నారు. సెంట్ర‌ల్‌లో రాధా ఉండ‌డ‌మే త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అనుకునే టీడీపీ నాయ‌కులు కూడా ఉన్నారు. ఇక‌, మ‌ల్లాది విష్ణుకు టికెట్ ఇచ్చినా ఆయ‌న‌ను కూడా ఎదుర్కొన‌డం తేలికేన‌ని చెబుత‌న్నారు. 


అయితే, రాధా విష‌యంలో మాత్రం సెంట్ర‌ల్ టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతుండ‌డం వెనుక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా ప‌ట్టులేద‌నే విష‌యం తెలిసిందే. పైగా సెంట్ర‌ల్‌లో ఇప్ప‌టికీ రంగా అభిమానులు, రంగా ఉనికి స‌జీవంగా ఉన్నాయి. దీంతో ఆయ‌న సెంట్ర‌ల్‌పై ప‌ట్టు ప‌డుతున్నారు. కానీ, వైసీపీ కాకుండా వేరే పార్టీపై ఆయ‌న పోటీ చేస్తే గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్య‌మేనా అనేది కూడా ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాధా వ్య‌వ‌హారం చాలా ఆస‌క్తిగా మారింది.

2004లో ఒక్క‌సారి ఎమ్మెల్యే అయిన రాధా పెద్ద‌గా చేసింది ఏమీలేదు. పైగా విజ‌య‌వాడ న‌గ‌ర క‌మిష‌న‌ర్‌తో గొడ‌వ‌ప‌డి అల్ల‌ర‌య్యాడు. దీంతోనే కాంగ్రెస్‌లో తీవ్ర విభేదాలు కూడా వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు వైసీపీలో నేత‌లు ఎవ‌రూ ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు ముందుకు రాక‌పోవ‌డం అంటే.. ఆయ‌న‌ను వదిలించుకునేందుకు పార్టీ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ వ‌దిలించుకోడానిక‌న్నా ముందుగానే తాను పార్టీని వీడాల‌ని రాధా నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: