స్పెషల్: కన్నడ కుమార రాజా విందులో తెలుగు చంద్రుని మిర్చి మసాలా ఘాటు


కర్ణాటకలో నారా చంద్రుల మహారాజా వారికి అనుకూల మీడియా లేకపోవటం - ఆ ప్రజల తలపై ఈయన గారి ఒక్కరోజు బసతోనే కులాసాల విలాసాల భారం భరించ లేనంతగా పడటం, అక్కడ బెంగుళూరు మిర్రర్ పత్రిక సేకరించిన సమాచారం దేశంలోనే సంచలనం రేపింది. 


అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ కార్యక్రమానికి హాజరైనా పర్యటించినా,  విదేశాలకు వెళ్లినా ఖర్చు మాత్రం తడిసి మోపెడు అవుతోంది.ఈ మద్య ఆయన కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన హోటల్ ఖర్చు ఏకంగా ₹8.70 లక్షల రూపాయలు అయిందట.

 

దీనిపై బెంగుళూరు మిర్రర్ ఒక ఆసక్తికర కదనం ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించింది. గతంలో సిద్దరామయ్య, ఎడ్యూరప్పలు ముఖ్యమంత్రు లుగా పదవీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అతిదుల కోసం ఖర్చు పెట్టలేదు. కాని కాంగ్రెస్ సిగ్గుమాలిన నిర్వాకంతో తంతే గార్లె బుట్టలో పడ్ద  కుమారస్వామి ప్రభుత్వం మాత్రం ముప్పై ఏడు లక్షల రూపాయలు వ్యయం చేసిందట.

 

బెంగుళూరు మిర్రర్  సమాచార హక్కు చట్టం కింద ఈ సమాచారం సేకరించారు. కాగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ₹1.85 లక్షల రూపాయలు, ఇతర నేతలకు సగటున ఒక లక్ష రూపాయలు వ్యయం అయిందట. ఇక్కడ విశేషం ఏమిటంటే చంద్రబాబు మే ఇరవై మూడో తేదీన ఉదయం 9:49 నిమిషాలకు “తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్”లో దిగిన ఆయన మే ఇరవై నాలుగో తేదీ ఉదయం 5.34 గంటలకు ఖాళీ చేశారు. అంటే 17 గంటలకు గాను ₹8.70 లక్షల రూపాయలు చంద్రబాబు ఖర్చు చేశారంటే ఈయన ఆంధ్రుల నెత్తినెక్కి విందు విలాసాల్లో తైతిక్కలాడే ముఖ్యమంత్రి అసాధారణ భారాన్ని ప్రజలెలా మోస్తున్నారో పాపం! అని కర్నాటక ప్రజలు అనుకొన్నారట.

 

కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్ డి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి అయిన ఖర్చు పై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించి  బెంగళూరు మిర్రర్ ప్రచురించిన కథనం దేశంలోనే సంచలనమైంది. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ పార్టీ నేతలు హాజరవగా - అతిథి మర్యాదల కోసం కర్ణాటక ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించడం “కన్నడ నెటిజన్ల” లో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.

 

ఈ సంఘటనతో ప్రజలనుండి పన్నుల రూపంలో వసూలైన - ప్రభుత్వ సొమ్ముతో మన జాతి నేతలు చేసుకొనే మజా విలాస వైభోగాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వీళ్లందరూ బెంగళూరు కార్యక్రమంలో గడిపింది కొన్ని గంటలే అయినా, వీరి అతిథి మర్యాదల బిల్లులు మాత్రం కర్ణాటక నెత్తిన పడి తడిసి మోపెడయ్యాయి.

 

పొరుగు రాష్ట్రం నెత్తిన బడ్డ ఈ  తెలుగు దుబారా బాబు గారి చంద్రలీలామృతం ప్రక్క రాష్ట్రంలో బహిర్గతం అవటంతో మన ముఖ్యమంత్రి గారి కీర్తి దిగంతాలకు వ్యాపించింది. దేశంలోనే అత్యంత ధనవతుడై, చేతికి వాచీ ఉంగరాలు కూడా లేని ముఖ్యమంత్రి విలాస జీవితం కొత్తగా ఏర్పడ్డ, రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ లాంటి అతి పేద రాష్ట్రాన్ని ఇంకా ధారుణ ఋణభారంలోకి నెట్టేస్తున్నారు.

 

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బెంగళూరులో వీరి బస, ఇతర ఏర్పాట్ల కోసం కర్ణాటక ప్రభుత్వ ఖజానా నుంచి భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఒక్కో నేత కోసం సగటున ఒక్కొక్కరికి లక్ష రూపాయ లు, అందులో అన్నింటి లో ప్రధముడైన నాలుగు దశాబ్ధాల సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్య మంత్రి గారికి గరిష్టంగా ₹8.70 లక్షల రూపాయల మొత్తం వరకూ వెచ్చించింది.

 

కొన్ని గంటలసేపటి కోసమే వీళ్ల అతిథి మర్యాదల ఖర్చు ఈ స్థాయిలో ఉండటంతో నెటిజన్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతగా వీరికి అతిథి మర్యాదలు చేయాల నుకుంటే జేడీఎస్ పార్టీ తమ సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసుకోవాల్సింది అని, ముక్కుపిండి ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రజల సొమ్ముతో ఇంతలా బస, విందు, విలాసాలకు దుబారా ఖర్చు చేయటం ఎందుకు  అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

కన్నడ నెటిజన్లు బాగా ఆశ్చర్యపోతున్నది ముఖ్యంగా ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఖర్చు గురించేనట, కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అని బెంగళూరు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ దాదాపు 18 గంటల సేపు ఉన్నారు. ఈ గంటల వ్యవధిలోనే బాబు అతిథి మర్యాదలకు కర్ణాటక ప్రభుత్వం వెచ్చించిన మొత్తం అక్షరాలా ₹ 8.70 లక్షల రూపాయలు. మిగిలిన నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఖర్చు ఒక్కొక్కరి మీదా లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ఉండగా, చంద్రబాబు ఖర్చు మాత్రం ఏకంగా ₹8.70 లక్షల రూపాయలుగా నమోదవ్వడం పట్ల అందరూ షకింగ్ కు గురై నిశ్చేష్టులు అవుతున్నారు. మరీ ఇంత విలాసమా? ముఖ్యమంత్రి పదవి అంటే ఇంత వైభోగమా? ఆని సామాన్యుడు కూడా నోరు తెరుచుకొని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.

 

ఈ దుబారా వ్యవహారంలో జేడీఎస్ పై అటు మీడియా నుంచి, ప్రజల నుంచి విమర్శల వర్షం కురుస్తుండగా, ఈ విలాస వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రముఖం గా నిలుస్తుండటం తెలుగుదేశం పార్టీకి, వారి అనుకూల మీడియాకి ఇబ్బందికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: