ధీమాగా ఉన్న జగన్, 2019 ఎన్నికలలో అన్ని పార్టీలు ఒక వైపు జగన్ మరొకవైపు..!

KSK
తమ రాజకీయ లబ్ధికోసం అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రజలు 2014 ఎన్నికల్లో తగిన విధంగా జవాబు ఇవ్వడం జరిగింది తమ ఓటు ద్వారా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇందులోభాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చేతులు కలపడానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది. మొత్తంమీద రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల లక్ష్యం చూస్తుంటే రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ లేకుండా చేయాలనే వ్యూహం పన్నుతున్నట్లు అర్థమవుతుంది.

ఇందులో భాగంగానే చంద్రబాబు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పెద్దలతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా చంద్రబాబుకు ఇబ్బందులు రాలేదు. కానీ ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే చంద్రబాబుకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకే చంద్రబాబు కూడా కాంగ్రెస్ పుంజుకోవాలి…. వైసీపీ అధికారానికి దూరంగా ఉండాలనే ఆకాంక్షిస్తున్నారు.

ఇక చంద్రబాబు శ్రేయస్సునే ఎక్కువగా ఆశించే కొందరు కమ్యూనిస్టు నేతలు కూడా పరోక్షంగా వైసీపీ అధికారంలోకి రాకూడదనే కోరుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కొత్తకూటమిని సిద్ధం చేసేందుకు రామకృష్ణలాంటి వారు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుమూలంగా నే గతంలో రామకృష్ణ వచ్చేఎన్నికలలో వైసీపీ పార్టీ  అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పడం గమనార్హం.

మొత్తంమీద చూసుకుంటే ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఒక సైడ్ అయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి పార్టీ మరొక సైడ్ అన్నట్టుగా అర్థమవుతుంది. అయితే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వ్యూహాలు పన్నినా కానీ జగన్ ఇంతకుముందు రాబోయే ఎన్నికలలో కూడా సింగల్ గానే వస్తామని ధీమాగా చెప్పడం విశేషం. గత 2014 ఎన్నికలలో కొద్దిపాటి శాతంతో అధికారం కోల్పోయిన వైసిపి పార్టీని 2019 ఎన్నికలలో ఎలాగోలాగా అధికారం రాకుండా చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రజలు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ ఆదరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: