నటుడు శివాజి "అపరేషణ్ గరుడ" బహు బీతావహం - టిడిపి కోసం ఇంత త్యాగం చేయాలా?

నటుడు శొంఠినేని శివాజీ చెప్పిన భీతి గొలిపే భయానక  భీభత్స రసాత్మక కథ కడుంగడు రసవత్తరం. ప్రథాన కథ 'ఆపరేషన్ ద్రవిడ ' దాని ఉప కథలే 'ఆపరేషన్ గరుడ ' పేరుతో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లలో రాజకీయాధికారం చిక్కించుకోవటం ప్రధాన లక్ష్యంగా పని చేస్తుంది. 

రెండవది 'ఆపరేషన్ రావణ ' తమిళనాడు కేరళ రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించుకోవటానికి ఉద్దేశించినవి. ఇక మూడవది "ఆపరేషన్ కుమార ' కర్ణాటకలో అధికారం చేపట్టే ప్రయోగం. మొత్తం మీద కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనే కదా! (అంతరార్ధం) దక్షిణాదిని రాజకీయంగా గుప్పిట్లోకి తెచ్చుకునే వ్యూహం. సినిమా కథ బాహుబలి కంటే చాలా బాగుంది, కథనం అంతకంటే మధురం. 

ఏ రాజకీయ పార్టీ ఐనా మొత్తం దక్షిణ భారతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే ఈ మాత్రం రసవత్తర కార్యక్రమం నిర్వహించక తప్పదు. ₹ 4800 కోట్ల రూపాయిల బడ్జెట్ అన్నారు. ఈ మాత్రం ఖర్చవదా? రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి సినిమా నిర్మాణానికే ₹ 600 కోట్ల పెట్టుబడి అవసరమైందని విన్నాం. 

అదిసరే, తెలుగుదేశం పార్టీ ఒక్క నంద్యాల శాసనసభా స్థానాన్ని గెలవటానికే చంద్రబాబు ₹ 500 కోట్లు ఖర్చు చేశారంటారు వైఎస్ జగన్. అంతెందుకు మనం టెలివిజన్ల ముందు కూర్చ్ హొని చూసిన ఓట్ కు నోట్ & బ్రీఫ్డ్ మె ఆడియో చిత్రీకరణ - అదే తెలంగాణా శాసనమండలి ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ అభ్యర్ధి 'ఎల్విస్ స్టీఫెన్-సన్' తెలంగాణా రాష్ట్ర సమితి గోడ దూకించించి తెలుగు దేశం పార్టీ లోకి తీసుకు రావటానికి ప్రణాళికా వ్యయం ₹ 5 కోట్లు. ఆక్షణాన ఇచ్చిన అడ్వాన్స్ ₹0.50 కోట్లు. ఇలా ఒక ప్రతిపక్ష ఎమెల్సిని నొక్కేయటానికి బాబుగారి బడ్జెట్ ₹5 కోట్లైనపుడు, మద్యవర్తులు, బ్రోకర్లు, డబ్బు సమకూర్చేవాళ్ళు ఇలా, ఒక్కొక్కరికి సమర్పయామి అన్నదంతా కలిపి, మొత్తం ఎమెల్సి కొనగోలు వ్యయం MRP ₹ 10 కోట్లైనా ఉంటుంది. ఒక ఎమెల్సి కొనగోలు అసలు ధర ₹ 10 కోట్లైతే ప్రజల నుండి ఎన్నుకోబడ్ద ఎమెల్యే ధర ₹ 15 నుండి ₹ 20 కోట్లు పలకవచ్చు. 

ఆ లెక్కన 22మంది ఎమ్మెల్యేల కొనగోలు ధర ₹ 440 కోట్లు అయి ఉండొచ్చు. అది కొన్న పార్టీ అధినేతకే తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో టికెట్ కన్-ఫర్మ్ చేయటం, కాంట్రాక్టులు, కుటుంబ సభ్యులకు పదవులు, ఆయా ఎమెల్యే స్థాయిని బట్టి వీటికి కూడా ధర ఉంటుంది. అఫ్ట్రాల్ ఒక రాష్ట్రంలో అధికారం చేజిక్కంచుకొని దాన్ని నిలబెట్టు కోవటానికే ₹ 1000 కోట్ల వరకు పలకగా ఇంకా ఒక నియోజకవర్గ గెలుపుకు ₹500 కోట్లు ఖర్చైతే మొత్తం తెదెపా 100 స్థానాలు గెలవాలనుకుంటే ₹ 50000 కోట్లు అవదా? అందులో లెక్కలు ఎక్కువను కున్నా డిస్కౌంట్స్ రిబేట్స్ పోగా  ఏతావాతా 50% కు సరిచేసినా ₹ 25000 కోట్లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు వ్రేళ్ళూనుకోవటానికి, జగన్ ను జనం లోకి పంపేసి శాసనసభను సవ్యంగా నడపటానికి  తెలుగుదేశం పార్టీకి ఇంత సొమ్ములు అవసరం కదా!  

దక్షిణభారతంలో కాలూనాలంటే రాజకీయంగా అయ్యే ఖర్చు ₹ 4800 కోట్లు బహు స్వల్పం. అన్నట్లు, ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అయినంతమాత్రాన ఈ ఎన్నికల కుమ్ములాటలో ప్రాంతీయ పార్టీలు ఇతర జాతీయ పార్టీలు తక్కు వేమీ తినవు. వాళ్ళు వాళ్ల నాటకాలు రసవత్తరంగా రక్తిగట్టిస్థారు. "అనుకున్నదంతా జరగదు - అనుకున్నట్లు జరగదు"  శొంటినేని శివాజి చెప్పిందంతా ఒక ట్రాష్. ఈ మాత్రానికే తనకు ప్రాణభయం ఉందని అయినా తాను ప్రాణ త్యాగానికి సిద్ధమని భీతి నటించటం ఒక "అద్భుత మెలో డ్రామా" ఉదయం నుండి సాయంత్రం, అంతకు ముందు అసలు కథ గురించి అప్పుడప్పుడు లీకు లిస్తూ వచ్చి సస్పెన్స్ ను క్లైమాక్స్ తెచ్చిన విధానం మాత్రం "బాహుబలి" కథను తలపించింది.

అంతా అలోచించి చూస్తే "బాగమతి" సినిమాలా తేలిపోయింది. కనీసం "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని?" రాజమౌళి జనాన్ని రెండుసంవత్సరాలు కళ్ళుకాయలు  కాసేలా నిరీక్షింప జేశారు. చివరకు "బాహుబలి" అనుకున్న కథ "బాగమతి" లా తేలిపోయింది.

శివాజి చెప్పినట్లు ఈ భీతావహ కథలో ప్రజలు, వారి ప్రయోజనాలకోసం త్యాగం ఎక్కడా ఏమాత్రమూ లేవు. "అంత్య దశకు చేరుకొన్న ఒక అధికార పార్టీ ఆఖరి ఆక్రందన - అత్యాశతో ఉదృతంగా దూసుకువచ్చే ఒక జాతీయ పార్టీ అత్యాశ" మాత్రం ప్రస్పుటంగా బాక్-గ్రౌండ్ -స్కోర్ లో చక్కగా వీనుల విందుగా బహు భీతావహంగా కనిపించింది. ప్రత్యేక హోదా ఐనా ప్రత్యేక పాకేజీ ఐనా రాజకీయనాయకులు వారి కుటుంబాలకు మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తాయి. ప్రజలకు పన్నులు వాటి ఎక్జెంప్షణ్స్ ఏమీ ప్రయోజనమివ్వవు. వారికి ప్రభుత్వాలు ఇవ్వాల్సింది విద్య ఆరోగ్యం మాత్రమే. ఇవి ఇస్తే సర్వస్వం ఇచ్చినట్లే. ఈ మాత్రానికి ప్రజలు ప్రయోజనాలు అనే ఈ సుత్తి ఒక డెబ్బైయేళ్లనుంచీ చూస్తూనే ఉన్నాం.

దీంతో పచ్చపత్రికలకు, పచ్చ చానల్స్ కు, ఒక నెల మనుగడ తో గ్రాసం దొరికింది. డియర్ శివాజీ! భయ్యా! కథలకు భయపడే ప్రజలు లేరయ్యా!  తెలుగు జాతి "ఆపరేషన్ పిల్లనిచ్చిన మామ" ను చూసింది. "ఆపరేషన్  అల్లుడి వెన్నుపోటు" ను భరించింది. ₹ 25000 కోట్ల ఆపరేషన్ పరేషాన్ను చూస్తుంది. ఆఫ్ట్రాల్, ఆపరేషన్ ద్రవిడ అందులోని గరుడ ఎంత? ఈ జాతిని ఈ నీతిమాలిన రాజకీయ కుక్కలు ఏమీ చేయలేవు.   
కాకపోతే అక్కడ బాగమతి అనుష్క నటన తారస్థాయికి చేరిందన్నపేరైనా మిగిలింది. ఇక్కడ శివాజి మాష్టారు ఒక " వైట్ బోర్డ్ పై చాక్పీస్" తో పాఠ చెప్పిన తీరు మాత్రమే పేలవంగా గుర్తుంటుంది. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. కాకపోతే తెలుగుదేశం రాజకీయ నేపధ్యం వ్యూహాన్ని బూకబోర్లా పడేసింది ఇంటర్వల్ బాంగ్అన్నమాట ఇక మిగిలిన కథ అమలులో యధార్ధ ప్రజాయవనిక పై చూద్ధాం.


అర్ధమైంది ఒకటే "శివాజి పెద్ద ఆఫ్రికన్ ఏనుగును సినిమాని చూపెట్టి, దాని భాతావహదాడిని అంతకన్నా భయంకరంగా, పెంచి ప్రేక్షకుల్లో  టెంపో పెంచి...చివరికి అది దాని  విద్వంసాన్ని అది వదలిన వాయువు అదే  .... ద్వారా వచ్చే ధ్వనితో పేల్చెయ్యాలనుకుంటే - జస్ట్ అది "తుస్" మంది. అంతే" 


బాజపా అనే భూతాన్ని చూపించి - జగన్ పవన్ లను భయపెట్టే వ్యూహం ఈ కథలో సుస్పష్టం. ఐతే అటు జగన్ ఈ స్థితిని ఎప్పుడోదాటేశాదు గత నాలుగేళ్ళుగా తెదెపా దౌర్జన్యాన్ని భరిస్తూ ముందుకుపోతూ ప్రజల హృదయాలను గెలుస్తున్నాడు. ఇక పవన్ కు కావలసినంత  అభిమానుల ఆదరణ ఉండి. వీళ్ళని ఎవరూ పీకేదేం లేదు. ఇక తెదెపాది కూలిపోతున్న ప్రాభవం. 
ఈ మద్య సినిమా రంగం లోనుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉత్తర దక్షిన భారతం అంటూ దేశాన్ని విడగొట్టే ప్రక్రియల్లో వ్యూహమే ఆపరేషణ్ ద్రవిడ ఇతరత్రా....ఇప్పుడు కావలసింది ప్రత్యేక హోదా! మాత్రమే. తెలుగుదేశం గెలుపు మాత్రం కాదు.
ప్రత్యేక హోదా తెచ్చిన వారు...అది ఇచ్చిన వారే గెలుస్తారు. ఈ కుల ప్రాంత ప్రాతిపదికన ప్రెచ్చరిల్లే రాజకీయాలకు అంత స్థానం ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: