ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చే పథకాలు ఏవైనా ఉంటే తామే ఈ సలహాలు ఇచ్చామని ఫలితంగానే అది ఆచరణకు నోచుకుందని కొంత మంది నాయకులు కొత్త రాగం అందుకుంటున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటు వంటి సందర్భంలో అమలు చేసిన పథకాలు కాంగ్రెస్ పార్టీవే నని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుండగా కాంగ్రెస్ పార్టీవే అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదని వైఎస్ఆర్ సిపి నాయకులు చెబుతున్నారు. కాగా అమలవుతున్నటువంటి పథకాలు ఎవరివో అంతుపట్టక ప్రజలు అయోమయానికి గురవుతున్న సందర్భంలో ఫీజు రియింబర్స్ మెంట్ పథకం తానే సూచించానని, ఈ పథకం నిరుపేద, మద్యతరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని అందుకే ఫీజు రియింబర్స్ మెంట్ ను ఉపసంహరించుకుంటే అందుకు వ్యతిరేకంగా పోరాడుతామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఈ విషయంపై అనేక చర్చ జరిగింది. ఈ పథకం చంద్రబాబునాయుడే సూచిస్తే తెలుగుదేశం అధికారలో ఉండగా ఎందుకు అమలు చేయలేదని మెజార్టీ ప్రజలు అభిప్రాయ పడుతున్న సందర్భంలో పిసిసి అధ్యక్షులు బొత్ససత్యనారాయణ ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని తామే సూచించానని, తాము కసరత్తు చేసి నివేదిక అందజేస్తేనే వైఎస్ఆర్ అమలు చేశాడని అందుకే ఆయనకు పేరువచ్చిందని బొత్స తన సహచరులతో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఇందిర జలప్రభ పథకం తన సతీమణి బొత్సఝాన్సీ ప్రతిపాదించారని బొత్స వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. కాగా ముఖ్య మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నటు వంటి సమయంలో కనీసం నోరుమెదపని వారు అతను మరణించిన తర్వాత అతను ప్రవేశ పెట్టిన పథకాలు తామే ప్రవేశ పెట్టామని పలువురు నాయకులు అంటున్నారంటే ప్రజలు ఈ విషయాన్ని ఏ విధంగా విశ్వసిస్తరనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజల్లో మంచి పేరు తెచ్చిన పథకాలు తామే సూచించామని నాయకులు కొందరు ఎవరికి వారుగా ప్రకటించు కోవడం చూస్తుంటే భవిష్యత్తులో మరింత మంది తామే సూచించామని ప్రచారం చేసుకున్న ఆశ్చర్య పడనవసరం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: