తెలుగు దేశానికి బ్రహ్మణ ఆగ్రహం తప్పదా?



ఆల్ ఇండియా బ్రాహ్మణ కమ్యూనిటి డెవలప్మెంట్ (ఏబిసిడి) కు చెందిన ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ జాతీయ కార్యదర్శి ఎం.ఎల్‌.ఎన్‌. శ్రీనివాస్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐవైఆర్‌ కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం నీచాతి నీచమైన చర్య అని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మంగళవారం సాయంత్రం ఆయన పలువురు బ్రాహ్మణ ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐవైఆర్ కృష్ణారావు నిష్పక్షపాతంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, అవినీతికి, సిఫార్సులకు ఆస్కారం లేకుండా దరఖాస్తులు ఆన్‌లైన్‌ లోనే పెట్టి స్వీకరిస్తూ ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అలాంటి వ్యక్తిని కుంటి సాకులు చెప్పి తొలగించడం చాలా వేదనాభరితమూ మరియు బాధాకరమన్నారు.


పరమ సాత్వికుడైన ఆయనపై తెలుగుదేశం అధికారము లో ఈ ఏపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు చాలా దారుణ ము, అమానవీయమని అన్నారు.  ఫేస్‌-బుక్‌లో అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టింగులను షేర్ చేశారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారని, విశాఖలో జరిగిన మహానాడుకు ఆయన రాలేదని, కోన రఘుపతి ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు యావత్‌ బ్రాహ్మణ సమాజానికి బాధ కలిగిస్తు న్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఐవీఆర్‌ కృష్ణారావు చేసిన సేవలను గుర్తించి ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గానే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకమై తదుపరి కార్యచరణ ప్రకటిస్తా మన్నారు. సమావేశంలో విశాఖ జిల్లా బ్రాహ్మణ ఫెడరేషన్‌ అధ్యక్షుడు శ్రి చరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


గతములో బ్రాహ్మణ వర్గాల శాపం తగిలే తెలుగుదేశం ప్రభుత్వం అదీ అత్యంత ప్రతిష్ఠాత్మక ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు పాలనలోనే మంటగలిసిందని వారి శాపమే ఎన్ టి ఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేసిందని అంటుంటారు. ఇప్పుడు టిడిపి పాలన అంతా లోపాలపుట్ట, అవినీతిమయం కాబట్టి ఈ శాపాలు అతి వేగంగా టిడిపిని కట్టి కుడుపుతాయని అంటున్నారు. 



బ్రాహ్మణ  విద్వేషి బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళ మాటలు వింటే టిడిపి పతనపథం లోకే నడిచే పరిస్థితులు దాపురిస్థాయని అంటున్నారు. గతములో రహదారుల విస్థరణ సమయలో బుద్ధా వెంకన్న, కేసినేని నాని లాంటివాళ్ళను బ్రహ్మణ శాపాలు ఇప్పటికే చుట్టుముట్టాయని అంటున్నారు. 



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: