ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు సెల్యూట్..ఇస్రో చ‌రిత్ర‌లో మ‌రో ఘ‌న‌ విజ‌యం..!

Edari Rama Krishna
భారత దేశం గర్వించదగ్గ సమయం రానే వచ్చింది.. నేడు ఇస్రో కొత్త చరిత్ర సృష్టించబోతోంది.   ప్రపంచ దేశాలు మనవైపే చూసే తొలి ప్రయోగం ఇవాళ జరిగింది. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(జీఎస్‌ఎల్‌వీ) మార్క్-3 డీ1 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు.  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముతూ జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ నింగికి దూసుకెళుతోంది. ఈ ప్రయోగం ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ ప్ర‌యోగాన్ని ఇస్రో ఛైర్మ‌న్ కిర‌ణ్ కుమార్ ద‌గ్గ‌రుండి పర్య‌వేక్షిస్తున్నారు. ఈ ప్ర‌యోగం కోసం నిన్న‌ సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.  ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూశారు. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ... జీశాట్-19 ఉపగ్రహాన్ని విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలో ప్రవేశ‌పెట్టింది.

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో చ‌రిత్ర‌లో మ‌రో ఘ‌న‌ విజ‌యం న‌మోదైన సంద‌ర్భంగా ఆ సంస్థ ఛైర్మ‌న్ కిర‌ణ్‌కుమార్ మాట్లాడుతూ హ‌ర్షం వ్యక్తం చేశారు. ఇస్రో డైరెక్ట‌ర్‌ కున్హి కృష్ణ‌న్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. క్లిష్ట‌త‌ర‌మైన రాకెట్ల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌డం భార‌త్‌కి అల‌వాటైపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఇది దేశానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు.    
   


GSLV Mk III-D1 Successfully launches GSAT-19https://t.co/1d7H5rWOEY pic.twitter.com/EiZsEVf70C

— ISRO (@isro) June 5, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: