"కాశ్మీర్ పై కలగచేసుకుంటాం" - భారత్ కు చైనా వార్నింగ్



చైనా భారత్ పై దాదాపు గూండాయిజానికే దిగుతుంది.  డ్రాగన్ దాని  సహజ సిద్ధమైన గుణం  బ్లాక్ మెయిలింగ్.  ప్రతిదానికి బెదిరింపు ధోరణులతో భారత్ పై విషం కక్కుతూనే ఉంది. డ్రాగన్ అధికార మీడియా” డైలీ టైం స్”  ఆదేశపు విపరీత పోకడల నైజమును తన రాతల ద్వారా  మరోసారి  బయట పెట్టింది. 


టిబెట్  ఆథ్యాత్మిక మతగురువు దలైలామాను తాము వద్దంటున్నా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు అనుమతించడంపై చైనా అగ్గమీద గుగ్గిలమవుతోంది. భారత్‌కు అడ్డుకట్ట వేసేందుకు. ఇప్పటికే వేర్పాటువాదుల అల్లర్లతో అట్టుకుతున్న ” కాశ్మీర్‌ అంశంపై కారుకూతలు”  కూస్తోంది.


దలైలామా అరుణాచల్‌లో అడుగుపెట్టకుండా సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసిన,  చైనా, ఆయన పర్యటనను  ఆపకపోతే “కల్లోల కాశ్మీర్‌ విషయం” లో తాము కలుగజేసుకోవాల్సి  వస్తుందని హెచ్చ రించింది.





ఈ మేరకు చైనా అధికారిక మీడియాలో ప్రత్యేక కథనం ప్రచురించింది. దలైలామాను ఆహ్వానించా లన్న భారత నిర్ణయం “మతిలేని చర్య,  అనాగరికం’’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేసింది.


 కాగా బుధవారం భారత దౌత్యాధికారి వీకే గోఖలేకు సమన్లు ఇచ్చి తీవ్ర నిరసన తెలిపింది. దలైలామా పర్యటనను వెంటనే రద్దు చేయాలంటూ భారత్‌ను కోరిన,  మరుసటి రోజే మరింత  అగ్గిరాజేయడం గమనార్హం.





దలైలామా పర్యటన రాజకీయాలకు అతీతమైనదనీ,  కేవలం మతపరమైన వ్యవహారమైనందును ఆయన పర్యటనను అడ్డుకోబోమని భారత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


అసలు చైనా మనసులో  "చైనా పాక్ ఎకనమిక్ కారిడార్" (సిపిఈసి) విషయములో భారత్ విధానం చైనాకు  “గొంతులో పచ్చి వెలక్కాయ పడ్దట్టుంది”   అలాగే  ఐఖ్యరాజ్య సమితిలో కాశ్మీర్ తీవ్రవాది జైషే మహమ్మద్ (JeM) ప్రముఖుడు మసూద్ అజహర్ ను వెనుకేసుకు రావటం చూస్తుంటే పాకిస్థాన్ ను,  అడ్డుపెట్టుకొని భారత్ పై దాడి చేసే ప్రణాళిక ఏదో ఉండే ఉంటుంది. భారత్ జాగ్రత్త పడటం అవసరం.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: