హైదరాబాద్: అక్రమ ఆస్తులు, తన కంపెనీలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల కేసులో జగన్ ను రెండో దఫా కస్టడీకి తీసుకున్న సీబీఐ విచారణ రెండో రోజూ ముగిసింది. ఇప్పటికే మొదటి దఫా ఐదు రోజుల పాటు జగన్ ను సీబీఐ విచారించింది. ఈ ఐదురోజుల కస్టడీలో జగన్ ను తమకు ఏ మాత్రం సహకరించలేదనీ, అదనంగా మరికొన్ని రోజుల కస్టడీ కావాలనీ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ వేశారు. సీబీఐ పిటీషన్ మేరకు జగన్ను విచారించడానికి అదనంగా మరో రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రెండో దఫా విచారణ నిమిత్తం శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆదివారంతో రెండ్రోజుల కస్టడీ ముగిసింది. చంచల్గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి జగన్ ను తరలించారు. అక్కడ జగన్ లాయర్ల సమక్షంలో పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయమై సీబీఐ అనేక ప్రశ్నల వర్షం కురిపించింది. జగన్ ను సీబీఐ అధికారులు ఆరున్నర గంటల పాటు విచారించిన అనంతరం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ముగియడంతో జగన్ ను తిరిగి సోమవారం నాడు సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నది.
మరింత సమాచారం తెలుసుకోండి: