హైదరాబాద్: రాష్ర్ట ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 20నెలలు కావస్తోంది. ఎవరి అంచనాలకు అందకుండా సీఎం సీటును దక్కించుకోవడంలో సక్సెస్ అయిన కిరణ్ కేబినెట్ లో మాత్రం ఇప్పటి వరకు పూర్తి పట్టును సాధించలేకపోయారు. అయితే,ఇప్పుడిప్పుడే తన పట్టు కోసం కిరణ్ శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే సీనియర్ మంత్రులకు చెక్ పెడుతున్నారు. తన మార్కు కోసం జిల్లాల ఇంఛార్జి మంత్రులను మార్పు చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత కేబినెట్ దాదాపుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిపోయిందే. మెజార్టీ మంత్రులు సీఎం కంటే సీనియర్లుగా ఉన్న వారే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కిరణ్కు కేబినెట్ లోని పలువురు సీనియర్ మంత్రుల నుంచి ఆశించినంతగా మద్దతు లభించడం లేదనీ అనేకమార్లు రుజువైంది. ఎలాగైనా కేబినెట్ లో తన మార్కును చూపించాలనే తహతహతో కిరణ్ ఉన్నారు.
దీనిలో భాగంగానే జిల్లా ఇంఛార్జి మంత్రుల మార్పు చేశాడనీ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పలు జిల్లాలకు ఉన్న ఇంఛార్జి మంత్రులకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చారు. కేబినెట్ పై పట్టు సాధించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న కిరణ్ పలు జిల్లాలకు ఇంఛార్జి మంత్రులుగా ఉన్న సీనియర్లను తప్పించి జూనియర్లయిన మంత్రులకు కీలక బాధ్యతలను అప్పగించడం పట్ల సీనియర్లు రగిలిపోతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో పాటు సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, మాణిక్యవరప్రసాద్, శత్రుచర్ల, అరుణకుమారి, వసంతకుమార్, దానం, ఆనం వంటి వారికి ఉద్వాసన పలికారు. కొత్తగా మంత్రి పదవీ చేపట్టినటు వంటి తోట నరసింహం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాస్ రావు వంటి వాళ్లకు ఇంఛార్జి మంత్రులుగా నియమించారు.
దీనితోనే, తనకు అనుకూలంగా ఉన్నటు వంటి జూనియర్లకు కిరణ్ పెద్దపీఠ వేస్తుండాన్ని సీనియర్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ లో పూర్తిగా తన మార్కు ఉండాలనుకోవడం కిరణ్ నిర్ణయం తప్పుకాదు. సేమ్ టైంలో సీనియర్లను జిల్లాల ఇంఛార్జి బాధ్యతలను నుంచి తప్పించడం కిరణ్కు రానున్న రోజుల్లో కొన్ని చిక్కులు తెప్పించే ఆస్కారం లేకపోలేదు. సీఎం తాజాగా చేపట్టిన జిల్లాల ఇంఛార్జి మంత్రుల మార్పులు, తప్పించడం ముఖ్యమంత్రికి మద్దతు పెంచుతుందా? లేదా? అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. మొత్తికి సీనియర్లకు చెక్ పెట్టి, కేవలం తనకు అనుకూలంగా ఉండేటు వంటి వారికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తాజాగా మార్పులు చేసిన జిల్లాల ఇంఛార్జి మంత్రులతో తేలిపోయింది. తన ముద్ర కోసం పాట్లు పడుతున్న కిరణ్ సక్సెస్ అవుతాడా? లేదా? అనేది మరి కొద్ది నెలలు ఆగితే కానీ చెప్పడం కష్టం.
మరింత సమాచారం తెలుసుకోండి: