తెలంగాణపై నిర్ణయం ఆలస్యం?

Kuthuru Raji Reddy
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం కోసం మరికొంతకాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయాన్ని త్వరగా తేల్చేయాలంటూ రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ యువనేత రాహూల్ గాంధీని కోరడంతో మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఫృద్వీరాజ్ చౌహాన్, పశ్చిమబెంగాల్ పిసిసి నేత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తెలంగాణ విషయం మరికొంతకాలం పట్టవచ్చునని ప్రచారం జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణను ప్రకటిస్తే విదర్భను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మహరాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ అభ్యంతరాన్ని తెలియజేయగా, గూర్కాలాండ్ డిమాండ్ ను తప్పించుకోవడం కష్టమని పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు తేల్చి చెప్పడంతో రాహూల్ గాంధీ డైలామాలో పడ్డట్లు తెలుస్తుంది. తెలంగాణను ప్రకటించిన వెంటనే దేశం మొత్తంమీద చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ పెరిగే అవకాశముందని, అందుకే ఈవిషయంలో అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇరురాష్ట్రాల నేతలు రాహూల్ గాంధీతో తెలియజేసినట్లుగా తెలుస్తుంది. కాగా అన్నింటిని అధిగమించి తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు వస్తాయా అనే విషయంలో రాహూల్ గాంధీ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘనవిజయం సాధిస్తుందని టీకాంగీ నేతలు చెబుతున్నటువంటి మాటలు ఎంతవరకు నిజమనే విషయంలో నేరుగా రాహూల్ గాంధీయే తన వేగుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనే విషయాన్ని రాహూల్ గాంధీ పంపినటువంటి వేగులు స్పష్టం చేస్తే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్ని రాష్ట్రాల నాయకులు ఎన్ని చెప్పిన అన్నింటిని విన్నటువంటి రాహూల్ గాంధీ తెలంగాణ విషయంలో అనుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: