కడగండ్లు మిగిల్చిన వడగండ్లు

Kuthuru Raji Reddy
అనుకోకుండా శుక్రవారం సాయంత్రం వివిధ జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో కురిసిన వర్షాలు, వడగాడ్పులు, రాళ్ల వర్షాలతో అనేక పంటలకు నస్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుత్ షాకుతో గొర్లకాపరి మృతి చెందగా ఆదిలాబాద్ జిల్లాలో రేకులషెడ్డుపైకప్పు కూలీ పోవడంతో అందులో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల డివిజన్ పరిధిలోని గంబీరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షాలు కురియడంతో మామిడి తోటలక తీవ్రనష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే పిందెకు వస్తున్నటువంటి చెట్లకు పిందే రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే విధంగా ఆకాల వర్షాలతో మామిడి చెట్ల పూతరాలిపోయింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, అనంతపురం తదితర జిల్లాలో వర్షాలు కురియడంతో రైతులు నష్టపోయారు. మెదక్ జిల్లాలో ఈసారి సాగుచేసిన పొద్దుతిరుగుడు పంటలు పూర్తిగా ద్వంసమయ్యాయి. కాగా తెలంగాణ జిల్లాలో కూరగాయలపంటల సాగుపై ఆదారపడినటువంటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. టమాట, వంకాయ, దోస, కీర వంటి పంటలకు తీవ్ర నస్టం వాటిల్లింది. అదే విధంగా బొప్పాయి తోటలు కూడా ఈదురు గాలులు, వడగండ్లతో చెట్లు విరిగిపడడం జరిగింది. ఫలితంగా లక్షల రూపాయల పంటనష్టం జరిగింది. ముఖ్యంగా మామిడి తోటలు పూత, పిందే దశలో ఉండగా ఇటువంటి వర్షాలు రైతులకు కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి. ఇటువంటి సందర్బంలో పంటనష్టాన్ని అంచనావేసి ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఎస్ తో ఫోన్ ద్వారా వర్షం తో జరిగిన నష్టం గూర్చి మాట్లాడారు. సంబంధిత అధికారులు నష్టం వివరాలను యుద్దప్రాతిపధికన చేపట్టాలని సూచించినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: