చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Devi Priya
ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గాంధీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ముస్లింలను అణచివేసే ధోరణితో పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోట మొదలు హైదరాబాద్ లోని చార్మినార్ సహా దేశంలోని చారిత్రత్మక కట్టడాలన్నీ నిజాం కాలంలో కట్టినవేనని, అవి ప్రభుత్వాల సొత్తుకాదని ఖాద్రి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్‌ప్యాలెన్స్‌లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీతో మిలాఖతై మద్ధతు ఉపసంహరణతోనే మాపై పగబూని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను జైల్‌లో పెట్టించి కక్షసాధింపు ధోరణికి పాల్పడుతున్నాడని పాషాఖాద్రి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: