హైదరాబాద్: ఇప్పటి వరకు పరోక్షంగా పార్టీ కోసం పని చేస్తున్న సినీనటుడు నందమూరి బాలక్రిష్ణ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడట. నందమూరి కుటుంబం-నారావారి కుటుంబంలో విభేదాలు లేవు. తామంతా ఒక్కటేననే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాను బావ, పార్టీ కోసం వస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేదంటూ ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించిన రెండ్రోజుల్లోనే బాలక్రిష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాననీ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే కాదు, పార్టీలో క్రీయాశీలక పాత్రను పోషిస్తానంటున్నాడు. పార్టీలో ఎలాంటి బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఇటీవల తన బావైన, పార్టీ అధినేత చంద్రబాబును కూడా కలిసి తన మనసులోని మాటను చెప్పినట్లు బాలక్రిష్ణ చెప్పారు. పార్టీ కోసం ఎన్నిలొచ్చినప్పుడల్లా బాలక్రిష్ణ తనవంతు సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. పలవురు అభ్యర్థలకు కూడా టికెట్లు ఇప్పించుకుని పార్టీలో తనకంటూ కొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం పార్టీ వరుస ఘోరపరాజయాలను చవిచూస్తోంది. అన్ని ఎన్నికల్లోనూ బొక్కాబోర్లపడ్డది.
రాష్ర్టంలో పార్టీ పరిస్థితి అంత బాగుగా లేదు. పలువురు నాయకులు పార్టీని వీడుతున్నారు. బాలక్రిష్ణ సోదరుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరిక్రిష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కొంత అసంత్రుప్తితో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు తన కుమారుడైన లోకేష్‌ను రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలొస్తున్న విషయం విధితమే. లోకేష్ ఎంట్రీ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను కొంత పక్కన బెట్టారనే వాదన లేకపోలేదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే నాని బహిరంగంగానే చెప్పారు.
ఈ నేపథ్యంలోనే బాలక్రిష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా, పార్టీ పటిష్టత కోసం ఎలాంటి బాధ్యతను అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడమే కాకుండా,2014ఎన్నికల్లోనూ టీడీపీ సీఎం అభ్యర్థి తనబావ, పార్టీ అధినేత చంద్రబాబే అని డిక్లరేషన్ కూడా ఇచ్చారు. పార్టీని పలువురు నాయకులు వీడుతున్న క్రమంలో బాలక్రిష్ణ క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తున్న ప్రకటించడం, తమ నేత బాబే అని చెప్పడంతో బావకు బాలక్రిష్ణ కొంత బలాన్ని ఇచ్చాడని చెప్పొచ్చు. ప్రస్తుతం పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ టైంలో బాలక్రిష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీని బతికించే ప్రయత్నం చేయడం సాహసంతో కూడుకున్న పని చెప్పాలి.
రాజకీయంగా ఎంతో నేర్పరి అయిన చంద్రబాబు నుంచి పార్టీని గెలిపించడం సాధ్యం కావడం లేదు. బావతో కానిదీ బామ్మర్ది బాలక్రిష్ణ నుంచి సాధ్యమవుతుందా? అనే దానిపై రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బాలక్రిష్ణ పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించాడు. ఫలితం ఎక్కడా కనిపించలేదు. గత మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పించుకున్న బాలక్రిష్ణ ప్రచారం వైపు తొంగిచూసిన పాపానపోలేదు. సినీ నటుడుగా బాలక్రిష్ణ గుర్తింపు పొందిన మాట వాస్తవం.
కానీ, రాజకీయంగా అంతగా ప్రజలు ఆదరిస్తారనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట. పార్టీ మరీ క్షీణదశకు చేరుకున్న సమయంలో బావకు, పార్టీకి నేను ఉన్నానంటూ బాలక్రిష్ణ వస్తున్నాడు. బాలక్రిష్ణ వల్ల పార్టీ ఏమైనా బాగుపడతదో, లేదో వేచి చూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: