‘మిన్నీ’ ఎదుట సవాళ్లు

Durga
రాష్ర్టంలో ఒకవైపు వరుస ఎన్నికలు, రాజకీయ అనిశ్చితి నీడలా వెంటాడుతున్నాయి. మరోవైపు సీబీఐ ఇతరత్ర కేసుల సెగతో దాదాపుగా పరిపాలన గాడితప్పింది. ముఖ్యంగా ఐఏఎస్ లు రోజువారి పాలన విషయాల్లో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు. ఇందుకు కారణంగా సౌమ్యుడిగా పేరొందని సీనియర్ ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో, మరో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఓఎంసీ కేసులో అరెస్టై జైళ్లోలో ఊచలు లెక్కపెడుతున్నారు. దీంతో ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనని ప్రస్తుత ఐఏఎస్ లు హడలెత్తిపోతున్నారు. 26 ప్రభుత్వ జీఓలకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసులు, ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నడుచుకున్న వారు నేడు జైళ్లలో ఊచలు లెక్కపెడుతుండటంతో వారి దుస్థితిని తలచుకొని కలలో కూడా తమకు ఆ పరిస్థితి రాకూడదని కొందరు ఐఏఎస్ లు లోలోప జంకుతున్నారు.  దీనికితోడు అమాత్యులు సీనియర్ ఐఏఎస్ ల మధ్య కోల్డ్ వార్ చాపకింద నీరులా ఉంది. తాజా పరిస్థితులు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూస్ సమర్దతకు సవాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మిన్నీ సంస్కరణలు ఎంతమేరకు ఫలితాలు ఇస్తాయోనని, అటు అమాత్యులు, ఇటు ఐఏఎస్, ఇతర అధికార వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.  ఇదిలా ఉండగా తమకు ఐఏఎస్ అధికారులు ఏమాత్రం సహకరించడంలేదని పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు ఇలా వ్యవహరిస్తే పాలన కష్టతరమవుతుందని, చిన్నచిన్న బదిలీలు సైతం కావడం లేదని, ఇప్పటికైన ప్రభుత్వం దీనిపై ద్రుష్టి సారించకపోతే సర్కారు ఇమేజ్ మరింత మసకబారక తప్పదని సీనియర్ మంత్రులు సీఎం ఎదుటనే తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.  మరోవైపు ఇన్ చార్జీ మంత్రులు సైతం స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అదే విధంగా డీఆర్సీలు నిర్వహించాలంటేనే అమాత్యులు బేజారెత్తుతున్నట్లు ఇప్పటికే సీఎంకు నిఘావర్గాలు నివేదిక సమర్పించినట్లు సమాచారం.  గాడితప్పిన పాలనను దారిలో పెట్టడంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సంబంధాలు తిరిగి పూర్వ స్థితికి తేవడానికి నూతన చీఫ్ సెక్రెటరీ మిన్నీ మాథ్యూస్ తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను వీలైనంత తొందరలో జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐఏఎస్ లు, ఐపీఎస్ లపై పట్టు సాధించాలని మాథ్యూస్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెలాఖరున మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితోపాటు సీనీయర్ ఐఏఎస్ లు జి.సుధీర్, భలేరావు పదవీ విరమణ చేసిన విషయం విధితమే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: