వల్లభనేని వంశీకి లైన్ క్లీయర్ ?

Durga
కృష్ణాజిల్లాలో కొడాలి నానీతో మొదలైన వలసలు ఎప్పటికి ముగుస్తాయో తిలియటం లేదు. నిన్న పోలిట్ బ్యూరో అధికారిగా ఉన్న ఉప్పలేటి కల్పన, ఇప్పుడు గన్నవరంకు చెందిన వల్లభనేని కూడా లైన్ క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నారు.  ఈనెల 21న వైసీపీలో చేరటానికి ముహుర్తం ఖరారైందని కూడా చెబుతున్నారు. అయేతే ఇదే జిల్లాలో నూజీవీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు మాత్రం వైసీపీ లోకి వెళ్లే చాన్సు కనబడటంలేదు. ఇప్పటికే నూజివీడు నుండి వైసీపీ నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్ముల్యే ప్రతాప్ ఆయనను వైసీపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. లేదంటే చిన్నం కూడా ఇదే వరసలో ఉండేవారు. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం నాయకులంతా క్యూ కట్టడానికి కారణం దేవినేని ఉమ అని తెలస్తుంది.  అంతే కాకుండా జూనియర్ ఎన్.టీ.ఆర్.కి సన్నిహితులుగా ఉంటున్న వారందరికి చంద్రబాబునాయుడు వేటువేయటం తద్యమని తెలియటంతో పార్ఠీలో జంప్ జిలానీలు ఎక్కువఅవుతున్నారు. గత లోక్ససభ ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఎంపీగా పోటీచేయడానికి సరైన సమయంలో పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారనేది వంశీ ఆరోపణ. తనకు దేవినేని నెహ్రుకు పార్టీలోని కార్యకర్తల కోసమే గొడవ జరిగినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని కూడా వంశీ వాపోతున్నట్టు తెలిసింది.  ఈసారి ఎలాగూ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇస్తారన్న గ్యారిటీ లేక పోవడం కూడా ఒక కారణం. గన్నవరం ఎం.పి.టిక్కెట్ దాసరి బాలవర్థన్ రావుకు, విజయవాడ టిక్కెట్ లింగమనేని రమేష్కు దక్కుతాయిని సంకేతాలు అందటంతో తెలుగుదేశం పార్టీలో రాజకీయ భవిష్యత్ ఉండదని తెలసుకున్న వంశీ, వైసీపీ లోకి అడుగు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకు గాను విజయవాడలోని వంగవీటి రాధా, కొడాలినాని సపోర్టు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: