చంద్రబాబు సమీక్షల పట్ల టిడిపి వారి నుండే తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమౌతుంది!

మా కొక మానేజర్ ఉండేవాడు. మానేజ్మెంట్లు అనేక ప్రొడక్ట్స్ కు సేల్స్ టార్గెట్స్ పెట్టేవాళ్ళు. వాటిని మార్కెట్ లోకి తీసుకెళ్ళి లక్ష్యాలు సాధించటానికి ఊరంతా రోజంతా తిరిగి అలసి వచ్చేవాళ్లం. సాయంత్రం ఆఫీస్ కు వచ్చి ఆనాటి నివేదిక సమర్పించి ఇంటికి వెళుతూ ఉంటే, మానేజర్ మాతో సమీక్ష అంటూ మరో రెండు గంటలు వాయించేవారు. దాంతో కొన్నాళ్లకు ఆయన బృందం పూర్తిగా "నాన్ -ఫర్ఫార్మర్మింగ్ టీం" (సాధించలేని బృందం) గా మిగిలిపోయింది.


అవసరమైతెనే సమీక్ష చెస్తే మంచిది. అవసరం లేనప్పుడు విశ్రాంతి తీసుకుంటే-ఆ తరవాత "పర్ఫార్మింగ్" (సాధించాల్సిన) సమయంలో అద్భుత పలితాలు వచ్చే పరిస్థితులు ఏర్పడుతుంది. ఏప్రిల్ 11న ఎన్నికలు అయిపోగా ప్రజా ఎంపిక ఈవీఎం లలో నిక్షిప్తమై పోయింది ఏ అభ్యర్ధి, ఏ పార్టీది గెలుపు అనేది మే 23ఎన్నికల పలితాల ప్రకటనలతో తెలిసిపోతుంది.


అయినా తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముందుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్ సరళి ఏ విధంగా ఉందన్న అంశంపై అభ్యర్థుల నుంచి విడివిడిగా నివేదిక లు తీసుకున్నారు.

TDP president and AP CM Nara Chandrababu Naidu begins the meeting with TDP leaders, MLA and MP candidates at CM camp office at Undavalli in Amaravati on Monday.


టీడీపీ నేతల్లో కనిపిస్తున్న ఓటమి భయాన్ని (వారిలో ఓడిపోతామన్న భయం ఉందనే అర్ధం) తొలగించేందుకు ఆ పార్టీ అధినేత చేసిన ప్రయత్నం ఫలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం లేదా ఉపశమనం తాత్కాలికమే ఎందుకంటే యధార్ధం ఎన్నికల పలితాల రోజునే తెలుస్తుంది. సోమవారం పార్టీ తరపున శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన బాబు, ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ పై అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు . ఆ తరువాత అక్కడి ఓటింగ్ తీరుపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని వారికి చంద్రబాబు అందించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే వైసీపీ నేతలు గెలుపు తమదే అంటూ ప్రచారం చేయడంతో, టీడీపీ నేతల్లో నిరాశ మొదలైంది.


అయితే పోలింగ్ సరళి తమకే అనుకూలమని ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో జరిగిన సమీక్షలోనూ ఆయన ఇదే రకమైన ధీమాను వ్యక్తం చేయడంతో పాటు ఇందుకు సంబంధించి తన దగ్గర పక్కా సర్వేలతో కూడా సమాచారం ఉందని వారికి తెలియజేశారు. అభ్యర్థు లందరూ ఒకరి దగ్గర ఉన్న సమాచారాన్ని మరొకరు ఇచ్చిపుచ్చు కోవాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.

టీడీపీ అధినేత ఓటింగ్ తీరుపై క్షుణ్ణంగా విశ్లేషించడంతో, కొందరు టీడీపీ అభ్యర్థులకు తమ గెలుపుపై భరోసా పెరిగిందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయినా ఈ శునక అనందం ఇప్పుడు అవసరమా? ఎలాగూ ఎన్నికల్లో భవితవ్యం తెలిపోనుంది కదా! పలితాలు వచ్చే వరకు ప్రశాంతంగా గడిపెయ్యటం మంచిది కదా! టిడిపి ప్రజా ప్రతినిధులకు ఇప్పుడు సీఎం సమీక్షలతో విశ్రాంతి ఉండదు సరికదా! ఫలితాల తరవాత ఏమౌతుందో...?  అన్న టెన్షన్ ఇంకా 30 రోజులు భరించాలని వారు ఇబ్బంది ని వ్యక్తం చేస్తున్నారు. 


సహచర రాజకీయపార్టీ,  వైసిపి అభ్యర్ధులు ఎన్నికల తరవాత చక్కగా జీవితం ఎంజాయ్ చేస్తుండగా, అధికారపక్ష సభ్యులు మాత్రం, సమీక్షలు అంటూ వారి నాయకుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తమకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారని విసుగు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: