ఏపీ: ప్రజలకు భారీ గుడ్.. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం..!
నాయి బ్రాహ్మణులకు.. నెలకు 200 యూనిట్లు వరకు ఉచితంగా ఉంటుంది.
రజకులు-నెలకు -150 యూనిట్ల వరకు ఉచితంగానే ఉంటుంది.
స్వర్ణకారులు నెలకు- 100 యూనిట్ల వరకు ఉచితంగానే ఉంది.
బిపిఎల్ కుటుంబాలకు నెలకు -100 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వనుంది.
అయితే జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సైతం ఈ పథకమందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి కలెక్టర్లకు కూడా ఉత్తర్వులను జారీ చేశారు. అర్హత కలిగిన వారందరూ కూడా APSPDCL కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సూచించారు.
ఇందుకు కావలసినవి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం అలాగే ప్రస్తుతం ఉన్న విద్యుత్ బిల్లు, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఉండాలి.
అత్యంత వెనుకబడిన వర్గాల పరిధిలో వచ్చేవారిలలో దాసరి, జోగి, జంగం, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు మొదలైన 32 ఉపక్లాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లు సైతం ఆదేశాలను జారీ చేశారు.
తాజాగా ఏపీలో జనాభా పెరుగుదల విషయం పైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మూడో బిడ్డకు జన్మనిస్తే ఆ దంపతులకు తక్షణమే రూ .30000 ఆర్థిక సహాయం ఇస్తామని, నాలుగో బిడ్డకు జన్మనిస్తే రూ .40,000 బహుమతి ఇస్తామంటూ ప్రకటించారు. రాబోయే రోజుల్లో భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం పథకాన్ని రూ. 15 వేలు కాస్త పెంచడానికి ప్రయత్నం చేస్తామంటు తెలిపారు చంద్రబాబు.