ఈరోజే దేశంలో ఉండే మొబైల్ ఫోన్లకు సైరన్ అలర్ట్.. ఎందుకంటే..?

Divya
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి ఒకేసారి గట్టిగా సైరన్ మోగినట్టుగా శబ్దం ఈరోజు (మే 2) వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమును పరీక్షించేందుకు ప్రత్యేక డీల్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ భారీ స్థాయి పరీక్షను టెలికమ్యూనికేషన్ శాఖ, NDMA తో కలసి సంయుక్తంగా చేపడుతోంది. ప్రకృతి ,విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో ప్రజలకు వేగవంతంగా ఇలాంటి సమాచారమైన అందించడానికి ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం అన్నట్లుగా తెలుస్తోంది.


ప్రభుత్వం దీనికి SACHET అనే పేరుతో పిలవబడుతోంది. అయితే ఏదైనా ముందస్తు హెచ్చరికల ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటివి జరగకుండా ఉండేందుకు వీటి యొక్క ముఖ్య ఉద్దేశమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యవస్థ CAP ఆధారంగా రూపొందించబడుతుంది. దేశంలో ఉండే 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటికీ ఈ వ్యవస్థని అమలులో చేసినట్లుగా తెలుస్తోంది. ఈ టెక్నాలజీ సెల్ బ్రాండ్ కాస్ట్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుందని సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో ఉండే వేలాది మంది మొబైల్ సకి ఒకేసారి అలెర్ట్ పంపిస్తుంది.


సాధారణ ఎస్ఎంఎస్ రూపంలో కాకుండా ఒక గట్టి సైరన్ శబ్దంతో స్క్రీన్ పైన ప్రత్యేకమైన సందేశం కూడా కనిపిస్తుందట. అంతేకాకుండా మొబైల్ సైలెంట్ లో ఉన్నా సరే ఈ అలర్ట్ వినిపించేలా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే ఇది దేశవ్యాప్తంగా అందరికీ కాకుండా కేవలం ప్రమాదం సంభవించే ప్రాంతాలలో మాత్రమే అలర్ట్ అయ్యేలా చేస్తుంది. దీంతో ప్రజలు కూడా అప్రమర్థం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ అలర్ట్ చూసి ఎవరూ కూడా ప్రజలు భయపడవద్దని ప్రభుత్వ ప్రయత్నానికి సహకరించాలంటూ సూచిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ అలర్ట్ సిస్టం వల్ల మరిన్ని అత్యవసర ప్రభుత్వ ప్రకటనలు , పబ్లిక్ సేఫ్టీ అలర్ట్ వంటివి కూడా పంపించేలా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: