ఏపీ: టెర్రరిస్టుల లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్..!

Divya
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఇండియాలో టెర్రరిస్టుల ఏరివేత జరుగుతోంది. దీంతో చాలా ప్రాంతాలలో అనుమానం వచ్చిన వారందరినీ కూడా విచారణ చేస్తున్నారు అధికారులు. అలా విజయవాడలో టెర్రర్ లింకుల కేసు ఇప్పుడు మరింత వేగంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా ఒక కీలక మలుపు తిరిగినట్టుగా సమాచారం. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన కోర్టు వారికి ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేసి మరి జైలుకి పంపించినట్లు తెలుస్తోంది.




ఈ కేసు తీవ్రతను సైతం దృష్టిలో ఉంచుకున్న పోలీసులు కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లారు. నిందితుల బ్యాంకు ఖాతాలు లావాదేవీలను పరిశీలించగా, నిందితులకు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్లో ఉన్న కాల్ డేటా మెసేజింగ్ వివరాలను విశ్లేషిస్తూ మరికొన్ని లింకులను గుర్తించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా నిందితులు పట్టుబడిన ఇళ్ళలో ఉగ్రవాద భావజాలానికి సంబంధించిన పుస్తకాలు, లిటరేచర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.



ఈ కేసులో కీలకమైన నిందితురాలుగా ఉన్న సైదా బేగం గురించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన ఈమె ఏడాది క్రితమే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉందని, అలా ఒంటరిగా ఉన్న సైదా  బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ని ఏర్పాటు చేసిందని, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగులను కూడా ఈమె షేర్ చేస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఈ కార్యక్రమాలు ఎక్కువగా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈమెకు విదేశీ హ్యాండర్లతో ఎక్కువగా సంబంధాలు ఉన్నాయని వారి సూచనలు మేరకే టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటికి తోడు యువతను రాడికలైజ్ చేసి మరి ఉగ్రవాద దిశగా అడుగులు వేయించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విచారణలో తేలిందట. ఈ విషయాల పైన మరింత విచారించేందుకు పోలీసులు కోర్టులో వారం రోజులు కస్టడీని కోరుతూ పిటిషన్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: