లోకసభ, అసెంబ్లీ స్థానాలు పెంపు.తెలుగు రాష్ట్రాలలో పెరిగే సీట్లు ఎన్ని అంటే..?
అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది 2029 ఎన్నికల నుంచి అమలులోకి వచ్చేలా బిల్లు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ, శాసనసభ స్థానాలు పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రతిపాదన ఆధారంగా తీసుకోవాలని సూచించింది. సెగ్మెంట్లను 50 శాతం పెంచి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఈ పార్లమెంట్ స్టేషన్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816 కు చేరే అవకాశం ఉన్నది.. ఇక ఏపీలో ఎమ్మెల్యే సీట్లు.. ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 262 లేదా 263 కి, ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38 కి పెరిగే అవకాశం ఉంటుంది.
తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సీట్లు 119 అసెంబ్లీ స్థానాల నుంచి 178 లేదా 179కి, ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 17 నుంచి 25 లేదా 26 పెరిగే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలను 6,185 కి పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాలను తాజాగా ఎన్డీఏ పక్షాల సమక్షంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియాలో భాగస్వామ్య పక్షాల నేతలకు వెల్లడించినట్లు వినిపిస్తున్నాయి.