ఏపీ: సూపర్ హిట్ కాదు సూపర్ ఫ్లాప్..చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

Divya
కూటమి ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బడ్జెట్లో చూపించిన లెక్కలన్నీ కూడా మోసాలు, తప్పుడు లెక్కలు అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రజలకు చేసిన మేలు ఏది లేదని అంత మోసమే కనిపిస్తోందని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను బడ్జెట్లో ఎక్కడ ప్రవేశపెట్టలేదని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారంటూ ఫైర్ అయ్యారు.


ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అంటూ మోసం చేశారు. గెలిచాక వాటిని అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటూ సీఎం చంద్రబాబు  గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే చంద్రబాబు అవుతారని, అబద్దాలకు రెక్కలు కడితే అవి ఆయన మాటలే అవుతాయని తెలిపారు. రాష్ట్ర అప్పులపై కూడా బడ్జెట్లో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.47 లక్షల కోట్లు ఉంది. 2014-19 వరకు చంద్రబాబు హయాంలో 2.49 లక్షల కోట్లు అప్పు చేశారు. 2019 నుంచి 24 వరకు వైసిపి హయాంలో 3.31 లక్షల కోట్లు అప్పు చేయక మా హయాంలో 9 లక్షల కోట్లు అప్పు చేసామంటూ ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు అప్పుడే 3.71 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పులు చేయడంలో చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు కొడుతున్నారంటూ వెల్లడించారు.



కనీసం ఆయన చేసిన అప్పులతో ఎక్కడైనా అభివృద్ధి గాని సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టారా అంటే అది కూడా లేదు. ఈ రెండేళ్లలో అప్పులు చేయడం జోబులో వేసుకోవడం మాత్రమే జరుగుతోంది. ఇచ్చిన హామీలను గత వైసిపి హయాంలో చేసి చూపించాము. కూటమి ప్రభుత్వం వాటిని చేయలేకపోయింది. మళ్లీ చంద్రబాబు పవన్ బాండ్లు ఇచ్చి హామీలు అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు కూడా చేశారు. ఈ రెండేళ్లలో హామీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని చెప్పారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు, శ్రీ శక్తి అని అమ్మవారి పేరు పెట్టి మహిళలను కూడా మోసం చేశారు. ఆడబిడ్డ నీది ప్రస్తావనే కనిపించలేదు. ఎస్సీ ఎస్టీ బీసీల మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు ఇప్పటివరకు వాటి ఊసే లేదు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని విరుచుకుపడ్డారు జగన్. ఇక కాగ్ లెక్కల ప్రకారం సొంత ఆదాయ అభివృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. వీటన్నిటికీ చంద్రబాబు అసమర్ధ కారణమని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: