ఏపీ:జిఎస్టిలో కొత్త కోణం..?

Divya
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి వసూళ్ల ఆదాయం తగ్గిపోయిందని, ఆ సమయంలో కూటమి సర్కార్ అప్పులు పెరుగుతూ ఉంటే ఆదాయం మాత్రం తగ్గిపోతోందని ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. కానీ తాజాగా జిఎస్టి వసూళ్లలో ఇప్పుడు ఏపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అమలులో వచ్చిన జీఎస్టీ సంస్కరణలు, పన్ను రేటు తగ్గింపు వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఏపీ ప్రభుత్వం తమ ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఈ నెలలో ముందంజలో ఉంది.


డిసెంబర్ 2025 నెలలో రాష్ట్ర నికర జీఎస్టీ వసూళ్లు గణాంకాలు మాత్రమే కాదు.. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం అయ్యేలా చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా. డిసెంబర్ 2025 ఏపీలో ఏకంగా రూ. 2,652 కోట్ల రూపాయల నికర జీఎస్టీ వసూళ్ల చేసింది. అయితే 2017 లో జీఎస్టీ విధానం అమలులోకి  వచ్చినప్పటి నుంచి 2025  డిసెంబర్ నెలలో నమోదైన అత్యధిక వసూళ్లు ఇవే కావడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5.79% వరకు వృద్ధి నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇది జాతీయ సగటు 5.61% కంటే మెరుగ్గా  ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.


అదే సందర్భంలో ఆర్థిక సంవత్సరం టోటల్ జీఎస్టీ పెరుగుదల జరిగిందా? తగ్గుదల జరిగిందా? ఆనే విషయం తెలియాలి అంటే మార్చి అయిపోయాక ఏప్రిల్ నెలలో తేలనుంది. 2025,26 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణాది రాష్ట్రాలలో జీఎస్టీ ఆదాయం పెరిగిన శాతం కర్ణాటక 13.1% , కేరళ 8.4%, తమిళనాడు 8.1%, తెలంగాణ 5.1%, ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ 5.34% తగ్గిందని, దేశవ్యాప్తంగా జిఎస్టి ఆదాయం 6.8% పెరిగితే ఆంధ్రాలో మాత్రం తగ్గింది అన్నటువంటి అంశాన్ని వైసిపి అనుకూల మీడియాలో రాసుకు వచ్చారు. వాస్తవంగా ఇది 2026 ఏప్రిల్ నెలలో జిఎస్టి పెరిగిందా? తగ్గిందా అనే  తేలుతుందని టిడిపి సోషల్ మీడియా కౌంటర్స్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: