జూబ్లిహిల్స్ బై పోల్‌: ఓట‌ర్ల‌కు ఆన్‌లైన్ పేమెంట్లు.. ఈ ట్విస్ట్ చూశారా...!

RAMAKRISHNA S.S.
- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) . . .


గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దీంతో ప్ర‌ధాన పార్టీలు ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంపిణీ ప్ర‌క్రియ కూడా మొద‌లు పెట్టేశారు. అయితే ఈ సారి డ‌బ్బు పంపిణీ లో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డ‌బ్బులు నేరుగా కాకుండా ఆన్ లైన్ లోనూ చేస్తున్నారు. డ‌బ్బు పంపిణీలో ఆన్‌లైన్ పేమెంట్లు కూడా జ‌రుగుతున్నాయి. యూస‌ఫ్‌గూడలోని ఓ బస్తీలో నాలుగంతస్తుల భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా, అందులో రెండు కుటుంబాలకు మాత్రమే ఒక‌ బూత్‌లో ఓట్లున్నాయి. రెండు రోజుల క్రితం ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్‌ ఇన్‌చార్జి ఆ కుటుంబాన్ని క‌లిశారు. ఓటుకు రు. 2 వేలు చొప్పున పోలింగ్ కు ముందే ఇస్తాన‌ని మాట ఇచ్చారు. ఆన్ లైన్‌లో యూపీఐ పేమెంట్ కు అవ‌కాశం ఉన్న ఫోన్ నెంబ‌ర్ సైతం తీసుకున్నాడు.


ఇంత‌లోగానే అదే కుటుంబాన్ని మ‌రో ప్ర‌ధాన పార్టీకి చెందిన బూత్ ఇన్‌చార్జ్ క‌లిశాడు. వెంట‌నే ముందు వెళ్లిన బూత్ ఇన్‌చార్జ్ రు. 2 వేలు ఒక ఓటుకు ఇస్తాన‌ని చెప్ప‌గా... రెండో ప్ర‌ధాన పార్టీ బూత్ ఇన్‌చార్జ్ రు. 3 వేలు ఒక ఓటుకు చొప్పున పంపిణీ చేశాడు. ఒక కుటుంబంలో నాలుగు ఓట్లు ఉండగా రూ.12 వేలు ఇచ్చారు. మరో కుటుంబంలో రెండు ఓట్లు ఉంటే రూ.6 వేలు చెల్లించారు. తమ పార్టీకే ఓటు వేయాలని వారి నుంచి హామీ లు.. ప్రామీస్‌లు చేయించుకున్నాడు. అయితే ఒక చోట ఓటుకు రు. 3 వేలు పంచుతోన్న ప్ర‌ధాన పార్టీ రహమత్‌నగర్‌ డివిజన్‌లోని ఓ బస్తీలో ఓటుకు రూ.2500 చొప్పున చెల్లించినట్లు తెలిసింది. దీంతో క్ష‌ణం క్ష‌ణానికి ఓటు రేటు జూబ్లిహిల్స్‌లో మారిపోతోంద‌నే చెప్పాలి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: