విడదల రజనీ సీటు మళ్లీ మార్చేస్తోన్న జగన్ ...?
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వైసిపి ఇన్చార్జ్ మాజీమంత్రి విడుదల రజినీకి మళ్ళీ స్థానాచలనం తప్పదా ?అంటే వైసిపి ముఖ్య నాయకులు అవుననే చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ కండువా కప్పుకుని చిలకలూరిపేట సీటు దక్కించుకున్న రజిని ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపాటి పుల్లారావు పై సంచలన విజయం సాధించిన రజనీకి అనూహ్యంగా మంత్రి పదవి కూడా జగన్ కట్టబెట్టారు. గత ఎన్నికలకు ముందు రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అక్కడ టిడిపి నుంచి పోటీ చేసిన గల్లా మాధవి చేతిలో రజనీ ఏకంగా 53,000 పట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రజనీని జగన్ తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు ఆమె అక్కడ యాక్టివ్గా పని చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు రజనీ ని బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గానికి పంపే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ. అక్కడ వరుసగా మూడు సార్లు గెలిచి ప్రస్తుతం మంత్రి గా ఉన్న అనగాని సత్య ప్రసాద్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ క్రమంలోనే బీసీ మహిళగా ఉన్న రజనీని అక్కడ పోటీ చేయిస్తే .. రజనీ దూకుడు ముందు సత్యప్రసాద్ జోరుకు బ్రేకులు వేయవచ్చన్నదే జగన్ ప్లాన్ అట.
ఇక్కడ గతంలో వైసీపీకి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఉండేవారు. ఆ తర్వాత రాజ్యసభ కు వెళ్లారు. ప్రస్తుతం పార్టీ మారిపోయారు. అక్కడ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఈవూరు గణేష్ ఉన్నారు. గణేష్ అంత యాక్టివ్ గా లేరు సరికదా.. అనగానిని ఢీ కొట్టే అంత క్యాపబుల్ ఉన్న పర్సన్ కాదంటున్నారు. అందుకే రజనీకి రేపల్లె పగ్గాలు అప్పగిస్తారంటున్నారు. ఆమె రేపల్లె వేళ్లేందుకు ఆసక్తితో లేరంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.