ఇండియాలో మద్యం తాగే టాప్ రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఎన్నో స్థానమంటే..?
అయితే ఈ 16 కోట్ల సంఖ్యలో 6 కోట్ల మంది పూర్తిగా మధ్యానికే బానిస అయ్యారని, అలాగే ఇందు లో 18 సంవత్సరాల నుంచి 49 ఏళ్ల మధ్య ఉండే యువతీ,యువకులు ఎక్కువగా ఉన్నదంటూ తెలుపుతున్నారు. మద్యం వినియోగంలో రాష్ట్రాల జాబితాల విషయానికి వస్తే.. భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించిన టాప్-10 జాబితను నిపుణులు సైతం విడుదల చేశారు. ఈ జాబితా అనేది ప్రతి ఏడాది మారుతూనే ఉన్నట్లు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
ఇందులో మొదటి స్థానం కర్ణాటక ఉండగా, 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 5వ స్థానంలో మహారాష్ట్ర, 6వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 7వ స్థానంలో కేరళ, 8స్థానంలో వెస్ట్ బెంగాల్, 9వ స్థానంలో రాజస్థాన్, 10వ స్థానం లో ఢిల్లీ ఉంది. ఈ గణాంకాల ప్రకారం మొదట ఆల్కహాల్ అలవాటుగా మొదలై క్రమంగా సమాజం పైన యువత పైన తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆరోగ్యం మరియు ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా ప్రభావం చూపించే విధంగా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అందుకే ఆల్కహాల్ అనేది వ్యాసనంగా మారితే జీవితాలే నాశనం అవుతాయని తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మద్యపాన నిషేధం ఉన్నది.