బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోడలికి చిత్రహింసలు.. అక్కడే అసలు ట్విస్ట్..!
పూర్తి వివరాల్లోకి వెళితే పోలవరానికి చెందిన యువతి జంగారెడ్డి గూడెంలో ఉండేటువంటి యువకుడు రంజిత్ కుమార్ ని రెండు సంవత్సరాల క్రితమే వివాహం చేసుకుంది. ఏడాది క్రితమే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అయితే రంజిత్ కుమార్ సోదరుడు కి పిల్లలు లేకపోవడంతో అతనితో కలిసి వారసుడికి జన్మనివ్వాలి అంటూ బాధితురాలి అత్తమామలు సైతం తన చిన్న కోడలి పైన తీవ్రమైన ఒత్తిని తీసుకువచ్చారు. అంతేకాకుండా ఈమె భర్తను ఊరికి పంపించు మరి వివాహితను చాలా చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలి సింది. ముఖ్యంగా తనకు పుట్టిన బిడ్డతో సహా గదిలో బంధించి భోజనం ,మంచినీరు, కరెంట్ సరఫరా లేకుండా చిత్రహింసలకు గురి చేశారు.
తన భర్తతో పాటుగా బావతో సంసారం చేయాలి అంటూ చిత్రహింసలకు గురి చేశారట. ముఖ్యంగా బాధితురాలు భర్త సోదరుడికి పిల్లలు లేకపోవడంతో అతనితో సంసారం చేసి పిల్లలను కనలంటూ చిత్రహింసలు చేస్తున్నారు. అత్తమామలు నిర్ణయానికి భర్త కూడా మౌనంగా ఉండిపోవడంతో అటు బాధితురాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘాల నేతలు సైతం పోలీసుల సహాయంతో నిన్నటి రోజున బాధితురాలు నివసిస్తున్నటువంటి ఇంటిలోకి బలవంతంగా వెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెకు అత్యవసర చికిత్స కూడా అందించడానికి ఆసుపత్రికి తరలించారు. ఆ బాధిత కుటుంబానికి సంబంధించి వారి పైన పైన పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.