ఏపీ: ఆ మహిళా నేతకు చుక్కలు చూపించిన మత్స్యకారులు..!
తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోనాడ గ్రామ మత్స్యకారుల వద్దకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్ళినటువంటి జనసేన ఎమ్మెల్యే నాగ మాధవి పైన అక్కడి మహిళలు సైతం ఆగ్రహాన్ని తెలియజేశారు. ముఖ్యంగా రేషన్ పంపిణీలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అందరికీ ఒకేలా సరుకులు ఇవ్వడం లేదంటూ అక్కడి మహిళలు సైతం ఎమ్మెల్యే పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ సహాయక చర్యలు, రేషన్ పంపిణీ విషయంపై సరైన విధానం లేకపోవడంతో అక్కడ స్థానికులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తిని తెలియజేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ ఎమ్మెల్యే నాగ మాధవి పర్యటనకు వచ్చినప్పటికీ కూడా తమ సమస్యలను అసలు పట్టించుకోవడంలేదని రేషన్ పంపిణీ సమానంగా నిర్వహించకపోవడం వల్ల మత్స్యకారుల మహిళలు సైతం ఎమ్మెల్యేను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పెరగడంతో ఎమ్మెల్యే నాగ మాధవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు విషయాలను చాలా లోపాలు ఉంటున్నాయంటూ మత్స్యకారులు సైతం విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శలపైన ఎమ్మెల్యే లోకం మాధవి ఏ విధంగా స్పందించి క్లారిటీ ఇస్తారు చూడాలి మరి. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొంథా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు.