మొంథా ఎఫెక్ట్: 43 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులంటే ?పూర్తి వివరాలు ఇవే..!
విశాఖపట్నం నుంచి నిత్యం ప్రధాన కేంద్రాలుగా సాగేటువంటి 43 రైళ్ల మూడు రోజులపాటు రద్దు చేసినట్లుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రకటించింది. తుఫాను తీవ్రతను చూసిన తర్వాతే తిరిగి మళ్ళీ ఈ సర్వీస్ లను పునరుద్దిస్తామంటూ రైల్వే సంస్థ ప్రకటించింది. మొంథా తుఫాన్ పెట్టుకునే పద్యంలో రైల్వే శాఖ అప్రమత్తమయ్యింది. ముందస్తుగా ఈనెల 27, 28, 29 తేదీలలో పలు రైలు రద్దు చేసినట్లుగా పేర్కొంది. ఇందులో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రద్దయిన రైళ్ల వివరాల విషయానికి వస్తే..
విశాఖపట్నం -గోదావరి ఎక్స్ప్రెస్
కిరం డోల్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్
విశాఖపట్నం-కిరండోల్ ఎక్స్ప్రెస్
రాజమండ్రి- విశాఖపట్నం మేము రైళ్లు
తిరుపతి- విశాఖపట్నం
విశాఖపట్నం-తిరుపతి
గుంటూరు- విశాఖ డబుల్ డెక్కర్
విశాఖపట్నం-గుంటూరు డబల్ డెక్కర్
విశాఖపట్నం-మహబూబ్నగర్ సూపర్ ఫాస్ట్
మొంథా తుఫాన్ నేపథ్యంలో కోస్తా జిల్లాలలో ఎక్కువగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు వస్తున్నాయి. గడిచిన 6 గంటలలో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 480 km, కాకినాడ 530 km, విశాఖపట్నం 560 km దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతం అయ్యి ఉందంటూ తెలియజేస్తున్నారు. ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికల్లా మరింత తీవ్రతను ఎక్కువ పెంచే అవకాశం ఉన్నది. కాకినాడ సమీపంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.