జూబ్లీహిల్స్ బైపోల్: హీరోల మద్దతు కోసం అభ్యర్థుల పాట్లు..!

Divya
జూబ్లీహిల్స్ నియోజవర్గ ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగబోతోంది. దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉండే సినీ కార్మికుల ఓట్లను తమ వైపు మళ్ళించుకునేందుకు పలు రకాల ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలా మూడు రకాల పార్టీల అభ్యర్థులు కూడా అందుకు తగ్గట్టుగానే విస్తృతంగా ప్రచారం చేస్తూ హామీలతో ముందుకు వెళ్తున్నారు. దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీనటులు సైతం లేకపోయినా తెర వెనుక పని చేసి 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్నారు.


ఇప్పుడు వీరందరిని ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల వారు కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నియోజవర్గ పరిధిలో ఉండేటువంటి రహ్మాత్ నగర్, శ్రీకృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, వెంకటగిరి, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట తదితర డివిజన్లో పరిధిలో చాలామంది టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ సభ్యులు, లైట్ బాయ్ లు, ప్రొడక్షన్స్ సభ్యులు డ్రైవర్లు ఇలా సినిమా షూటింగ్ కి పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరూ కూడా చిత్రపురి అనే కాలనీలో ఇళ్ల స్థలాలను కేటాయించగా, కొన్ని రాజకీయ కారణం వల్ల వేలాదిమంది కార్మికులకు అక్కడ స్థానం లభించలేదు.


అంతేకాకుండా వీరికి ఆరోగ్య భీమా సౌకర్యం లేదు ప్రభుత్వాలు మారిన సినీ కార్మికుల తలరాతలు మారడం లేదంటే వాపోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామంటు నేతలు హామీ ఇచ్చిన ఎవరూ కూడా వాటిని ఆచరణలోకి తీసుకురావడం లేదు. ఇప్పుడు మరొకసారి ఈ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సినీ కార్మికులు మళ్లీ గుర్తుకొస్తున్నారు.


గతంలో సినీ పరిశ్రమతో బిఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత భర్త గోపినాథ్ కు మంచి స్నేహబంధం ఉండేది. మొదటి నుంచి సినీవర్గాలతో మంచి స్నేహబంధం ఉండడంతో పాటుగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కూడా సినీ కార్మికులతో మంచి స్నేహబంధం ఉన్నది. దీంతో ఇప్పుడు ఈ కార్మికుల ఓటు హక్కు పొందేందుకు బిఆర్ఎస్ తగిన వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది.



అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైల యాదవ్ కు కూడా సినీ కార్మికులతో 30 ఏళ్లకు పైగా సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయన తనయుడు వెంకట్ హీరోగా కూడా పలు చిత్రాలను నిర్మించారు. వీరికి తోడు సినీ హీరో సుమన్ మద్దతుతో ప్రచారం చేయబోతున్నారట. దీంతో సినీ కార్మికుల మద్దతు కూడా తమకే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.


ఇక బిజెపి అభ్యర్థిగా ఉన్న దీపక్ రెడ్డి గతంలో టిడిపిలో ఉన్నారు. ఈ నేతకు కూడా సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి.


గత రెండు మూడు రోజుల నుంచి ప్రధాన పార్టీల సైతం సినీ కార్మికులు ఉండే ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలలో తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే సిని కార్మికులు ఉండే ప్రాంతాలలో రోడ్డు షో కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి మొదటిసారిగా సినీ కార్మికుల మద్దతు కోసం బిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి 24 వేల మంది ఉన్న సినీ కార్మికులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: