బీసీవై రామ‌చంద్ర యాద‌వ్‌కు కాపుల కృత‌జ్ఞ‌త‌లు

RAMAKRISHNA S.S.
బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని పార్టీ నాయకులు శ్రీ ఆకుల వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో జాతీయ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు శ్రీ కొత్తపల్లి రమేష్ నాయుడు గారు, వారి బృందం ఈ రోజు బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి లో కలవడం జరిగింది. ఇటీవల దారకానిపాడు గ్రామంలో జరిగిన అమానుష ఘటనపై స్పందించి తిరుమలశెట్టి లక్ష్మయ్య నాయుడి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించి వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విధంగా సదరు సంఘటనను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లిన రామచంద్ర యాదవ్ గారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే భవిష్యత్తులో చంద్రబాబు ప్రభుత్వం రామచంద్ర యాదవ్ గారి రాజ్యాంగ హక్కులను కాలరాసే ప్రయత్నం చేసే పరిస్థితులు ఏర్పడితే మేము తప్పకుండా అండగా ఉంటామని తెలియజేశారు.


ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో బడుగు బలహీనవర్గాల వారిని అధికారానికి దూరం చేసిన టీడీపీ వైసీపీ పార్టీలను రాజకీయ బహిష్కరణ చేయాలంటే అందరం కలిసికట్టుగా పరస్పర సహకారంతో పనిచేద్దామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి ఫణికుమార్, కొప్పినేని రాధాకృష్ణ , సాధనాల మణిబాబు, లక్కు శ్రీనివాసరావు, దాసరి సాంబశివరావు, దాసరి శివ నాగరాజు, కడలి మాణిక్యాలరావు, ఎయిర్టెల్ సతీష్, ఆకుల సురేష్ బాబు గార్లు మరియు బీసీవై పార్టీ నాయకురాలు ఆకుల జయ కళ్యాణి గారు పాల్గొన్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: