కొలిక‌పూడి లేటెస్ట్ టార్గెట్‌లో ట్విస్ట్ ముందే ఊహించిందే...?

RAMAKRISHNA S.S.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ‌రుస వివాదాల‌తో వార్త‌ల్లోకి ఎక్కుతూ పార్టీ ప‌రువును బ‌జారుకు ఈడుస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల్లోనే వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు వివాదాల‌తో బ‌హిరంగంగా పార్టీ ని బ‌జారులోకి పెట్టేసిన ఆయ‌న తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఐదు కోట్లు ఇచ్చానంటూ ఏకంగా ఫేస్ బుక్‌లో ఆయన పోస్టు పెట్టారు. బ్యాంక్ లావాదేవీల కాపీలను కూడా జత చేశారు. “ నిజం గెలవాలి.. నిజమే గెలవాలి ” అంటూ పోస్ట్ పెట్టిన ఆయన, డబ్బు చెల్లించిన వివరాలను కూడా ఓపెన్ గా చెప్పారు.


గ‌తేడాది అంటే 2024 లో ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, 8న మరో రూ.20 లక్షలు, 14న రూ.20 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేశానంటూ వివ‌రాలు మొత్తం బ‌య‌ట పెట్టారు. ఇక చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి రూ.50 లక్షలు తీసుకెళ్లాడని, గొల్లపూడిలో తన మిత్రులు రూ.3.5 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడు త‌న సొంత డ‌బ్బులు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టుకుంటాన‌ని .. క‌వ‌ర్ల‌కు ప‌ద‌వుల‌ను ఏనాడు అమ్ముకోలేద‌న్నారు. తాను క‌ష్ట‌ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే ప‌ద‌వులు కోసం ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు.


ఇక కొలిక‌పూడి తాను గ‌తంలో ఎంపీ చిన్ని లేక‌పోతే నేను లేన‌ని చెప్పార‌ని .. ఇప్పుడు ఇలా ఆరోపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌రు అని .. ఎవ‌రు ఎలాంటి వారో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తెలుసు అని చిన్ని అన్నారు. కొలికపూడి శ్రీనివాసరావు గతంలోనూ పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా పనిచేసిన ఆయన, 2024 ఎన్నికల్లో చంద్ర‌బాబు ఆయ‌న‌కు చివ‌ర్లో తిరువూరు సీటు ఇచ్చారు. గ‌త రెండు ద‌శాబ్దాల్లో టీడీపీ ఎప్పుడూ గెల‌వ‌ని చోట కొలిక‌పూడి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆయనపై గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, జర్నలిస్టులపై దాడులు వంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎంపీని టార్గెట్ చేశారు. ఏదేమైనా కొలిక‌పూడి తీరుతో తిరువూరులో పార్టీ కి పెద్ద మైన‌స్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: