కొబ్బరి బోండాలో నీరు తాగుతున్నారా..ఈ వీడియో చూస్తే జన్మలో ముట్టరు..!

Divya
ఈ మధ్యకాలంలో తరచూ పండ్లు, కాయగూరలు, మరికొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువగా కల్తీ జరుగుతున్నాయి. మనం రోజుతినే ఆహార పదార్థాలలో కల్తీ ఉండడంతో చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది కొబ్బరి నీళ్లు తాగడానికి మక్కువ చూపుతారు. మరి కొంతమంది సీజన్ లో పని లేకుండానే ఆరోగ్యంగా ఉండడం కోసం ఉదయం కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇది ఖరీదైనప్పటికీ కూడా కొబ్బరినీరు ఆరోగ్యానికి చాలా మంచిదిగా భావిస్తారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలు , మెగ్నీషియం, కాల్చియం వంటివి సహజంగానే లభిస్తాయి.

కానీ ఈ మధ్య కొంతమంది కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్న సంఘటనలు ఆలస్యంగా బయటపడ్డాయి. కొబ్బరికాయలను పెద్దవిగా బరువుగా చేయడానికి కొన్ని రసాయనాలను ఇంజెక్ట్ చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఈ వీడియోని వైరల్ గా చేస్తున్నారు. గతంలో క్యాబేజీ, టమోటా, అరటిపండు మరికొన్ని కూరగాయలకు రసాయనాలను ఎక్కించడం, పండ్లకు కూడా ఇంజెక్ట్ చేయడం వంటివి తరచూ చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు కొబ్బరి కాయలు మాత్రమే కల్తీ లేనివని అనుకున్నాము, ఇప్పుడు అది కూడా ఇంజక్ట్ చేయబడుతోందని తెలుస్తోంది. ఈ వీడియోలో వాటికి సంబంధించి పూర్తిగా చూపించారు. కొబ్బరికాయలకు ఇంజెక్ట్ చేస్తూ ఉన్న  విషయాన్ని చూసి  చాలామంది ఈ వీడియోల పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి వాటి పైన ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫైర్ అవుతున్నారు.అయితే ఈ వీడియో ఎక్కడిది అనేది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఎలాంటివి కొనాలి అన్న విషయంపై కచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని తెలియజేస్తున్నారు ప్రజలు. లేకపోతే మనం ఇలాంటి విషన్ని తినాల్సిన పరిస్థితి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. మరి కొంతమంది ఇంటిదగ్గర సహజంగా పండించుకొని తినడం ,తాగడం చేస్తే మంచిదంటూ సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: