బాలకృష్ణ పై జగన్ సంచలన వ్యాఖ్యలు ..అగ్గి రాజేశారుగా..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నకిలీ మద్యం వ్యవహారం బయటపడడంతో ఈ విషయంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా నడుస్తోందని ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి మరి వాటిని నడిపిస్తున్నారని బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ తో, నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల ఆరోగ్యం పణంగా పెట్టి మరి డబ్బులు సంపాదించుకున్నారు అంటూ కూటమి నేతల పైన ఫైర్ అయ్యారు. ఇటువంటి సందర్భంలోనే బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటుగానే విమర్శలు చేశారు.


మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చి మాట్లాడారని, అలా తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు?. బాలకృష్ణ చేసిన సంభాషణ పని పాట లేనివి అంటూ కూడా వెల్లడించారు. అలాగే అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి ?అంటూ నిలదీయడం జరిగింది. దీనివల్ల బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతోంది , ఆయన ఆరోగ్య పరిస్థితి పైన అనుమానాలను వ్యక్తం చేసేలా మాట్లాడారు జగన్.


అంతేకాకుండా తాగిన వ్యక్తిని కూడా అసెంబ్లీలోకి అనుమతించినందుకు గాను స్పీకర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాగిన వారిని అసెంబ్లీలోకి అనుమతించిన స్పీకర్ కు కూడా బుద్ధి లేదు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అసెంబ్లీలో బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ముందు ఆయన సైకలాజికల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి అంటూ వెల్లడించారు. ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాలలో, సోషల్ మీడియాలో తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. మరి ఈ విషయం పైన అటు బాలయ్య అభిమానులు, టిడిపి నేతలు ఎలాంటి కౌంటర్లు వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: