క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు: తెలంగాణ‌లో కిడ్నీ స‌మ‌స్య‌.. దేశంలోనే టాప్‌..!

Divya
తరచూ ఈ మధ్యకాలంలో పెద్దలు ,చిన్నపిల్లలు కిడ్నీ సమస్యలు, గుండెపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు గల కారణాలు అధిక రక్తపోటు, నియంత్రణలో లేని మధుమేహమే కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం అన్నట్లుగా జాతీయస్థాయిలో నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు ఎక్కువగా ఉన్నాయట. ప్రతి వందమందిలో కచ్చితంగా ఏడుగురికి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు ఇటీవలే వైద్య పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు.


కిడ్నీ సమస్యల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందంటూ వెల్లడించారు. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 25,408 మంది పైన పరిశోధనాలు చేయగా, దేశవ్యాప్తంగా సగటున 3.2 చేత మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ICMR పరిశోధనలు చేరింది. తెలంగాణలో 7.4 శాతం ఉందని.. జాతీయ సగటు కంటే ఇది 2 రెట్లు ఎక్కువగా ఉందంటూ వెల్లడించారు. అలాగే చిన్న రాష్ట్రమైన గోవా కూడా తెలంగాణతో పోలిస్తే 7.4 శాతంతో దేశంలోనే టాప్ గా ఉందంటూ తెలిపారు. అయితే బీహార్లో మాత్రం చాలా తక్కువగా 0.8 శాతం మంది బాధితులే ఉన్నట్లు తెలియజేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మహిళలకు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుపుతున్నారు.



దేశంలో అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. వైద్య ఆరోగ్య శాఖల గణాంకాల ప్రకారం సుమారుగా తెలంగాణలో 50 లక్షల మందికి పైగా ఉన్నట్లుగా గుర్తించారు. మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర, ఉబకాయం వంటి పరిస్థితుల వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువవుతున్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కిడ్నీ సమస్యలు బయటపడేసరికి మూత్రపిండాలు 70 నుంచి 80 శాతం వరకు పాడవుతున్నాయని తెలియజే స్తున్నారు.



జాతీయస్థాయిలో పరిశోధనలు చేయగా పట్టణాలలో 3.3 శాతం, గ్రామాలలో 3.2 శాతం తో కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు.

 ఇక మహిళల విషయానికి వస్తే.. 2.6 శాతం మంది పురుషులలో 3.8 శాతం మంది ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

మధుమేహం ఉన్నవారిలో ముప్పు 3.2  రెట్లు ఎక్కువగా ఉన్నదని, బీపీ ఉన్న వారిలో 2.4 శాతం ఉన్నదంట తెలిపారు.

దేశంలోని 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ కిడ్నీ బాధితుల సంఖ్య 4 నుంచి 6 శాతం ఉన్నారని తెలిపారు.


అత్యధికంగా (క్రానిక్) కిడ్నీ వ్యాధి (సికేడి ) ఎక్కువగా ఉన్నదంట ICMR పరిశోధనల తేలింది. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుచేతనే 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏటా కూడా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: