మత్తులో.. నన్ను రేప్ చేయడంటూ రెచ్చిపోయిన యువతి..వీడియో వైరల్..!

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో యువత ఎక్కువగా చెడు వ్యసనాలకు ,చెడు దారులకే బానిసగా మారుతున్నారు. ముఖ్యంగా యువతి యువకులు పట్టపగలి రోడ్లమీద అసభ్యకరమైన పనులు చేయడం, మద్యం సేవించడం, గంజాయి వంటివి సేవించడం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక యువతి మద్యం మత్తులో ఏకంగా తనని రేప్ చేయాలి అంటూ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



అసలు విషయంలోకి వెళ్తే ఉత్తరకాండలోని రిషిఖేష్ ప్రాంతంలో ఒక యువతి మద్యం సేవించి నడిరోడ్డు పైన హల్చల్ చేస్తూ నన్ను రేప్ చేయండి అంటూ కేకలు వేసింది. దీంతో రోడ్డుపైన కొంతమేరకు ఉద్రిక్తతమైన పరిస్థితులు నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నడిరోడ్డు పైన యువతి యువకులు తప్ప తాగి హల్ చల్ చేస్తున్న సమయంలో ఆ గ్యాంగులోనే ఒక యువతి రోడ్డుపైన వెళ్లే వారితో సెల్ఫీ దిగుతూ, తనను రేప్ చేయండి అంటూ వాగ్వాదానికి దిగింది. దీంతో చాలామంది నేటిజన్స్ యువతి పైన ఫైర్ అవుతూ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.



యువతి చేస్తున్న పనితీరుపైన మండిపడుతూ యువతీ యువకుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటు పోలీసులకు సలహా ఇస్తున్నారు. మరి కొంతమంది మాత్రం వ్యూస్ కోసం ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమే ఇలాంటి వీడియోలు చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది దేవస్థానాల దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర ఇలాంటి రీల్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. రాను రాను యువత చాలా బరితెగించి మరి ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు సోషల్ మీడియా నేటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఉత్తరఖండ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: