గోల్డ్:ధరలలో చరిత్ర తిరగ రాసిన బంగారం..!
ఈరోజు బంగారం ధరలు ఒక రికార్డు ఉంటే మరుసటి రోజు మరొక రికార్డు సృష్టిస్తోంది. తాజాగా చూస్తే 62 డాలర్స్ ఒక ఔన్స్ కి యాడ్ అయింది అమెరికాలో. ఒక్క రోజులోనే 3950 డాలర్ల వరకు పలుకుతోంది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,31,460 రూపాయల 10 గ్రాముల బంగారం ధర ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,930 రూపాయలు 10 గ్రాముల ధర. దీంతో బంగారం ధరలలో తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. మరి ఈ బంగారం ధరలు ఎక్కడ దాకా వెళ్తాయో అర్థం కావడం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు . ముఖ్యంగా దీపావళి, ధన్ తేరస్ సందర్భంగా మరింత పెరిగే అవకాశాలు బంగారం ధరలు కనిపిస్తున్నాయి.
అయితే ఇలా బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే కారణమని డాలర్ విలువ పతనం కావడం వల్ల బంగారం అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామంది బంగారం మీద పెట్టుబడులు సురక్షితమైన భావిస్తున్నారని, డాలర్ విలువ తగ్గిపోవడం వల్ల బంగారం డిమాండ్ కూడా పెరిగిందని తెలియజేస్తున్నారు. ఇలాగే పెరుగుతూ పోతే మాత్రం సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇక బులియన్ మార్కెట్లో కూడా బంగారం కంటే ఎక్కువగా వెండి ధరలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ రోజున వెండి కిలో రూ .100 రూపాయలు పెరగగా ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,56,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.