Youtube: మూడేళ్లలో ఇండియా ఆదాయం ఎంతో తెలుసా..?
టూరిజం దగ్గర నుంచి వంటలు, మందులు, రాజకీయాలు , ఫన్నీ వీడియోస్ ఇలా ఎన్నో సెక్టార్లలో బాగా వ్యాప్తి చెందింది యూట్యూబ్. వాటిని చూసే వారి సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆదాయం కూడా భారీగానే పెరిగింది. భారతదేశంలో యూట్యూబ్ కి మంచి ఆదాయం లభిస్తోంది. దీంతో ఇక్కడున్న ఇన్ఫ్లుయన్సర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ కి ఇస్తున్న ఆదాయం కూడా రీమిటెన్స్ రూపంలో ఇస్తోంది. అయితే అలా ఇప్పటివరకు రూ .21 వేల కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
భారతదేశంలో ఉన్నటువంటి యూట్యూబర్స్ కి రూ .21 వేల కోట్ల రూపాయలు అందించాము గడిచిన మూడేళ్లలో అందించామంటూ యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే ఇండియాలో కూడా యూట్యూబ్ ద్వారా భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో శృతి మించిన వీడియోలను కూడా అప్లోడ్ చేయడం వల్ల చాలా మంది వీటిని వినియోగించడానికి కూడా మొహమాట పడేలా చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా సోషల్ మీడియాని బాగా ఉపయోగిస్తూ ఉండడం చేత తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలాంటివి చూస్తున్నారనే విషయంపై చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.