ఏపీ: ఆ విషయంలో చంద్రబాబును నిలదీస్తూ జగన్ సంచలన పోస్ట్..!
రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడాలనే ఉద్దేశం మీకు ఏ కోణంలో కనిపించడం లేదని ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం పనులను చేయడానికి అడుగులు వేస్తూ ఉంటే.. కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదా? అంటు ప్రశ్నించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఏపీలో చాలా ప్రాంతాలలోని సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఈ విషయం పైన మీరెందుకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ చంద్రబాబును నిలదీశారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ దెబ్బతినేలా చేస్తూ ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి గతంలో మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణజలాల విషయంలో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేశారు.. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్లు ఉండగా 524.256 నీటిని నిలువ చేసుకోవడానికి అందుకు సంబంధించి స్పిల్ వే తో సహా, గేట్ల నిర్మాణం వంటి పనులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనివల్ల రాష్ట్రంలో కృష్ణా జలాల పైన ఆధారపడేటువంటి ప్రాంతాలు చాలా దెబ్బతింటాయని , త్రాగునీరు లేక ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో చూస్తూనే ఉన్నాము! ఇవన్నీ కూడా మీలాంటి వారి వైఫల్యమే కదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు జగన్ .ఇప్పటికైనా మేలుకోండి కేంద్రంలో ఎంపీల సంఖ్య పరంగా మీకు ఉన్న బలాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోండి అంటు జగన్ ట్విట్ చేశారు.