ఏపీ: విశాఖ ఉక్కు పై.. సంచలన ప్రకటన చేసిన ఎంపీ..!
ఆగస్టు 20న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని ప్రశ్నించామని.. అందుకు ఆయన సమాధానంగా ప్లాంట్ ను ఎక్కువకాలం నడపలేమని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా ప్లాంట్ ప్రైవేటీకరణం ఎప్పుడో ఒకరోజు జరిగే అవకాశం ఉందని తెలిపారు ఎంపీ గొల్లబాబు. అయితే ఈ విషయంలో మాత్రం వైసిపి పార్టీ చూస్తూ ఊరుకోదు.. విశాఖ ప్లాంట్ పై జాతీయస్థాయిలో కచ్చితంగా ఉద్యమిస్తామంటూ తెలిపారు ఎంపీ.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఒక చరిత్ర కలిగిందని ఎంతో మంది త్యాగాలు ఫలితంగానే ఈ ప్లాంట్ వచ్చిందని ఎంపీ గుర్తుకు చేశారు. ఈ ప్లాంట్ ప్రేవేటికరణమైతే ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని విశాఖ ప్రజలు నష్టపోతారంటూ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కచ్చితంగా ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన బాధ్యత కూటమి పెద్దల పైన ఉన్నదంటూ తెలియజేశారు. వీటికి తోడు చాలామంది వైసిపి నేతలు కూడా ఈ విషయం పైన డిమాండ్ చేశారు. విశాఖ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోందని కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబుతోనే క్లారిటీ వచ్చింది.. ఇంకా లేటు చేస్తే ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తి అయిపోతుందంటూ ఎంపీ గొల్ల బాబురావు తెలిపారు. ఈ విషయంపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.