జగన్ చేసిన తప్పే..చంద్రబాబు చేస్తున్నారా? కూటమి పై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నిరంతరం ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ ఉంటారు మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ. అప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా మాట్లాడారు.. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం పాలన గురించి సీఎం చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ గురించి పలు విషయాలను తాజాగా పాడు కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారని వెల్లడించారు. మరి ఆ తప్పు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


కూటమిపాలన ప్రధానంగా రెండు అంశాలపైనే జరుగుతోందని ఒకటి అమరావతి, మరొకటి పోలవరం, సూపర్ సిక్స్ హామీలు అమలు కోసమే .. ఇప్పటివరకు వీటి కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని.. జై భారత్ నేషనల్ పార్టీతో సహా తాము కూడా కోరుకున్నది ఏమిటంటే ఉచితలను లిమిట్ చేయండి కేవలం దివ్యాంగులకు, వితంతువులకు, వృద్ధులకు మాత్రమే పరిమితం చేయాలని కోరుకున్నాం మిగతా వారికి ఉపాధి కల్పిస్తే సరిపోతుంది. వాటి మీద మనం దృష్టి పెట్టాలి అంటూ తెలిపారు.


అసలు మనం ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోస్తాం .. గత జగన్ ప్రభుత్వంలో అప్పులు చేశారని మనమే చెప్పాము ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు.. అవే అప్పులు కంటిన్యూ అయితే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా ! ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో CAG రిపోర్ట్ ఇచ్చింది అంటూ తెలిపారు లక్ష్మీనారాయణ. ఎన్నికలలో గెలవడానికి ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు..ఒక పార్టీని మించి మరొక పార్టీ హామీలు ఇస్తున్నారంటూ అన్ని రాష్ట్రాలలోని వారు ఇలానే చేస్తున్నారు తెలిపారు. ఇలాంటి వాటన్నిటికీ ఎక్కడో ఒకచోట అడ్డుకట్టు పడితేనే రాష్ట్రం, రాష్ట్రాలు  బాగుంటాయని తెలిపారు.


కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయాలు ఏమిటంటే.. ప్రతి జిల్లాను కూడా అభివృద్ధి చేయాలి కేవలం ఒక్క  ప్రాంతాన్నే కాదు.. నిరుద్యోగ సమస్య కూడా చాలా ప్రధానమైన సమస్య.. ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలనే విషయం పైన ఆలోచించాలి, అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. అసలు అభివృద్ధిని, ప్రజాపాలననే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారంటే అలాంటి వారిని సస్పెండ్ చేస్తేనే సిస్టం సెట్ అవుతుందని మరి అలాంటి నిర్ణయాలు చంద్రబాబు ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: