ఆ పథకంతో ప్రతి కుటుంబానికి 25 లక్షల లబ్ది.. గొట్టిపాటి కామెంట్స్ వైరల్!
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగం మెరుగుదల, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన 120 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 70 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరలో "సంజీవని" పథకాన్ని కూడా తీసుకురానున్నామని, దీని ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
అంతేకాకుండా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యం పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవనం అందించడమేనని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
గొట్టిపాటి రవికుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రజలకు జరుగుతున్న మంచిని ఓర్వలేక జగన్ తన కడుపుమంటను వ్యక్తపరుస్తున్నాడని ఆయన తెలిపారు. గొట్టిపాటి రవికుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని సంవత్సరాల పాటు కూటమి హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు